/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
BREAKING NEWS
కడప జిల్లాలో ఒంట్టిమిట్ట, పులివెందుల ZPTC ఉపఎన్నిలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. జగన్ సొంత జిల్లా కావడంతో టీడీపీ అక్కడ గెలవాలని ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున పని చేసింది. పులివెందులలో ఇప్పటికే టీడీపీ గెలవగా.. ఒంటిమిట్టలో కౌంటింగ్ ఆలస్యం అయ్యింది. ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికలో కూడా టీడీపీ విజయకేతనం మోగించింది. టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి 12,780 ఓట్లుతో వైసీపీ అభ్యర్థి సూబ్బారెడ్డిపై గెలుపొందారు. 6267 ఓట్ల భారీ మెజార్టీతో ముద్దు కృష్ణారెడ్డి ZPTCగా విజయం సాధించారు.
ఒంటిమిట్ట జెడ్పిటిసిగా @JaiTDP అభ్యర్థి కృష్ణారెడ్డి గెలుపు..@YSRCParty అభ్యర్థి ఇరగం రెడ్డి సుబ్బారెడ్డికి 6,351 ఓట్లు
— Telugu Feed (@Telugufeedsite) August 14, 2025
టీడీపీ అభ్యర్థి కృష్ణారెడ్డి కి 12,505 ఓట్లు
6,267మెజారిటీతో టీడీపీ అభ్యర్థి కృష్ణారెడ్డి గెలుపు pic.twitter.com/bZB5MGmorl