/rtv/media/media_files/2025/09/20/a-great-tragedy-in-annamayya-district-2025-09-20-07-38-55.jpg)
A great tragedy in Annamayya district.
Andhra News:ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు అన్నమయ్య జిల్లాను అతలాకుతలం చేశాయి. జిల్లావ్యాప్తంగా శుక్రవారం రాత్రి కురిసిన కుంభవృష్టితో రాయచోటిలో విషాదం నెలకొంది. పట్టణంలో కురిసిన భారీ వర్షానికి వరద పోటెత్తింది. ఆ వర్షపునీటిలో నలుగురు కొట్టుకుపోయారు. వీరిలో ముగ్గురు మృతిచెందగా. ఒక చిన్నారి ఆచూకీ లభించలేదు. భారీ వర్షం కారణంగా రాయచోటిలోని మురుగు కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎస్ఎన్ కాలనీ అంగన్వాడీ వెనుక డ్రైనేజి కాలువలో ఓ మహిళ, బాలిక పడి కొట్టుకు పోయారు.ఎస్‌ఎన్ కాలనీ వెనుక భాగాన ఉన్న కాలువలో ఒక వృద్ధురాలు(60), ఆమె కుటుంబానికి చెందిన చిన్నారి(5) నీళ్లల్లో పడిపోయారు వారు కొట్టుకుపోతుండడాన్ని గమనించిన స్థానిక యువకుడు గంగయ్య కూడా వారితో పాటే కొట్టుకు పోయాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు గాలించి అక్కడికి సమీపంలోని గవర్నర్ ఫంక్షన్ హాల్ వద్ద ఉన్న కల్వర్టు నుంచి ఆ ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. మరోవైపు కె.రామాపురం సమీపంలో ఉన్న 4 కుళాయిల వద్ద నీటి ప్రవాహంలో యామిని (7) అనే బాలిక కొట్టుకుపోయింది. ఆమె ఆచూకీ లభించలేదు.
Also Read : దసరాకు సొంతూరు వెళ్లే వారికి అదిరిపోయే శుభవార్త.. TGSRTC కీలక ప్రకటన!
గడచిన 24 గంటలుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాల మధ్యల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. మరోవైపుఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రాయచోటిలో స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో వరద ప్రవాహంలో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమిదేళ్ల బాలిక వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. దీంతో ఆటోలో ఉన్న విద్యార్థులు, ఆటో డ్రైవర్ కాపాడామని కేకలు వేశారు. అది గమనించిన స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.ఆటోలో ఉన్న మరో ఆరుగురు విద్యార్థులను రక్షించారు. కానీ ప్రమాదవశాత్తు ఒక ఎనిమిదేళ్ల బాలిక వర్షపు నీటిలో పడి కొట్టుకుపోయింది.వెంటనే స్థానికులు పోలీసులు, రెస్క్యూ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు గల్లంతైన విద్యార్థి ఆచూకీ కోసం సమీపం ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా బాలిక మృతితో తల్లీదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Also Read : CM Reavnth Reddy : కేసీఆర్, ట్రంప్ ఒక్కటే.. సీఎం రేవంత్ సంచలన కామెంట్స్