/rtv/media/media_files/2025/08/22/ys-jagan-sharmila-2025-08-22-11-50-40.jpg)
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ మద్దతు ఇవ్వడంపై వైఎస్ షర్మిల(ys-sharmila) మండిపడ్డారు. వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ పార్టీ ముసుగు మరోసారి తొలిగిందన్నారు తొలగింది. లోనున్న కాషాయ కండువా మరోసారి బయటపడిందన్నారు. బీజేపీకి వైసీపీ బీ-టీం అని నిజ నిర్ధారణ జరిగింది.
YCP @YSRCParty ముసుగు మళ్ళీ తొలగింది. లోనున్న కాషాయ కండువా మరోసారి బయటపడింది. బీజేపీకి @BJP4India బీ-టీం అని నిజ నిర్ధారణ జరిగింది. మోడీ @narendramodi గారికి దత్తపుత్రుడే అని రాష్ట్ర ప్రజలకు కుండబద్దలు కొట్టినట్లు అర్ధం అయ్యింది. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ముసుగులో ఉన్నది మోడీ గారి…
— YS Sharmila (@realyssharmila) August 22, 2025
Also Read : AP Mega DSC Results: మెగా డీఎస్సీ మెరిట్ లిస్ట్.. ఈ లింక్ తో చెక్ చేసుకోండి!
YS Sharmila Tweet Over YS Jagan
మోదీకి జగన్ దత్తపుత్రుడే అని రాష్ట్ర ప్రజలకు కుండబద్దలు కొట్టినట్లు అర్ధం అయ్యిందన్నారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ముసుగులో ఉన్నది మోడీ గారి పక్షమేనని తేటతెల్లమైందన్నారు.అవినీతి కేసులకు భయపడి బీజేపీకి మళ్ళీ దాసోహం అన్నారు. 5 ఏళ్లు దోచుకుతిన్నది దాచుకోడానికి బీజేపీకి జై కొట్టారు.
చంద్రబాబు, జగన్(YS Jagan), పవన్ ముగ్గురు మోదీ(PM Modi) తొత్తులేనని ఫైర్ అయ్యారు. వీరంతా బీజేపీకి ఊడిగం చేసే బానిసలేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన పార్టీలది తెరమీద పొత్తని.. వైసీపీది మాత్రం తెరవెనుక అక్రమ పొత్తని ఫైర్ అయ్యారు. వైసీపీ తీరు రాష్ట్రంలో కూటమి పక్షాలతో కుస్తీ.. ఢిల్లీలో మతపిచ్చి బీజేపీతో దోస్తీ అని ధ్వజమెత్తారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ కూటమి నిలబెట్టిన బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి వైసీపీకి సిగ్గుండాలన్నారు. ఈ దేశంలో ఓట్ చోరితో రాజ్యాంగం ఖూనీ అయ్యే విషయం వైసీపీకి కనిపించదన్నారు.
మోదీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే విమర్శించడానికి YCP నోరు పెకలదని నిప్పులు చెరిగారు. దేశ ప్రతిపక్షాలన్నీ కలిసి రాజకీయాలతో సంబంధం లేని ఒక తెలుగు బిడ్డ, న్యాయ నిపుణుడిని ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దించాయన్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ నిలబెట్టిన ఆర్ఎస్ఎస్ వాదికి మద్దతు ఇస్తారా? అని వైసీపీని ప్రశ్నించారు షర్మిల. తెలుగు ప్రజలకు చేసిన ఈ ద్రోహంపై వైసీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read : ఇళ్లు లేని పేదలకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్.. త్వరలో 10 లక్షల ఇళ్లు