AP Crime: అయ్యో బిడ్డలు.. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ప్రాణం తీసిన ఈత సరదా.. ఎంతమంది చనిపోయారంటే?

అన్నమయ్య జిల్లా బాలరాజుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఈత కొట్టేందుకు వెళ్లిన ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు సుడిగుండంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మృతులు సోంబత్తిన దిలీప్, కొత్తూరు చంద్రశేఖర్ రెడ్డి, పీనరోతు కేశవగా గుర్తించారు.

New Update
_Kadapa Crime News

Kadapa Crime News

ఈత సరదా, ఆరోగ్యం రెండింటికీ ఉపయోగపడుతుంది. కానీ అది కొన్నిసార్లు విషాదకరంగా మారవచ్చు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే.. నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈతకు వెళ్ళేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. తెలియని ప్రాంతాల్లో, లోతైన నీళ్లలో ఈతకు దూరంగా ఉండాలి. ఒంటరిగా కాకుండా స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో వెళ్లడం మంచిది. అలాగే మద్యం సేవించి ఈతకు వెళ్లడం అత్యంత ప్రమాదకరం. నీటిలోకి దిగే ముందు.. ఆ ప్రాంతం సురక్షితమైనదో కాదో నిర్ధారించుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా ఇలాంటి విషాదాలు జరగకుండా నివారించవచ్చు. అయితే ఓ ముగ్గురు విద్యార్థులు ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఏపీలో కలకలం రేపింది.

ప్రాణాలు తీసిన ఈత..

స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు వెళ్లిన ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు విగతజీవులుగా మిగిలారు. ఈత సరదా వారి ప్రాణాలను బంగారం చేసి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ హృదయ విదారక ఘటన అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బాలరాజుపల్లి సమీపంలోని చెయ్యేరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాజంపేటలోని అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు సోంబత్తిన దిలీప్ (22), కొత్తూరు చంద్రశేఖర్ రెడ్డి (22), పీనరోతు కేశవ (22) స్నేహితులతో కలిసి చెయ్యేరు వద్దకు వెళ్లారు. మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో వీరు నదిలో ఈతకు దిగారు. కానీ లోతు తెలియక సుడిగుండంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి:  ప్రియుడికోసం మరో భార్య దారుణం..భర్తను చంపి..

ఈ విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు, స్నేహితులు హుటాహుటిన అక్కడికి చేరుకుని చూసేసరికి మృతదేహాలు కనిపించాయి. సమాచారం అందుకున్న రాజంపేట ఏఎస్పీ, రెవెన్యూ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థుల మృతదేహాలను బయటకు తీసి.. పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గాలివారిపల్లికి చెందిన దిలీప్, ఒంటిమిట్ట మండలం మంటపంపల్లికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి, పొరుమామిళ్లకు చెందిన కేశవ మృతితో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నదులు, చెరువుల వద్ద జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

ఇది కూడా చదవండి: తాగుబోతు భార్య.. తాగొద్దన్న భర్త..ఎలుకల మందుతాగి..

Advertisment
తాజా కథనాలు