జగన్ ఇలాకాలో YCPకి డిపాజిట్ గల్లంతు.. ఆ పార్టీ ఘోర పరాజయానికి 5 ప్రధాన కారణాలివే!

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఇంత దారుణ పరాజయం మూటగట్టుకోవడానికి ఆ పార్టీ చేసిన ఈ 5 తప్పులే ప్రధాన కారణమని విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

New Update
YS Jagan Pulivendula

జగన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో వైసీపీకి ఘోర పరాజయం మూటగట్టుకుంది. నేడు విడుదలైన ZPTC ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి హేమంత్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. కూటమి తరఫున బరిలోకి దిగిన మారెడ్డి లతా రెడ్డికి 6735 ఓట్లు రాగా.. YSRCP అభ్యర్థికి కేవలం 685 ఓట్లు వచ్చాయి. అయితే.. వైసీపీ ఇంత దారుణ పరాజయం మూటగట్టుకోవడానికి ఆ పార్టీ చేసిన ఈ 5 తప్పులే ప్రధాన కారణమని విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  1. మొదటగా ఎన్నికను వైసీపీ పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. కంచుకోటలో తమ గెలుపును అధికార పార్టీ ఆపలేదని ధీమాలో ఆ పార్టీ నేతలు ఉండిపోయారు. చనిపోయిన జెడ్పీటీసీ కొడుకుని పోటీకి దించడంతో సానుభూతి కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటూ కాలక్షేపం చేశారు. ఈలోగా క్షేత్ర స్థాయిలోకి కూటమి అభ్యర్థి చొచ్చుకుపోయారు.
  2. వైసీపీ తరఫున ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, జగన్ మామ రవీంద్రనాద్‌రెడ్డి, కడప మేయర్ సురేశ్ బాబు ప్రచారం చేశారు. అయితే.. రోజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లాంటి ముఖ్య నేతలను ప్రచారంలోకి దించితే కాస్త సానుకూల పరిస్థితి ఉండేదన్న చర్చ సాగుతోంది.
  3. ఇదే సమయంలో వివేకానంద రెడ్డి 74వ జయంతి రావడంతో.. పులివెందులలో ఆయన కూతురు సునీత, సతీమణి సౌభాగ్యమ్మ నివాళులర్పించారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమయంలో తండ్రి మరణం నాటి విషయాలు వెల్లడించారు. నాన్న హత్యకు కారణమైన వారికి శిక్ష పడేందుకు తాను ఇంకా ఎన్నేళ్లు న్యాయ పోరాటం చేయాలో అర్థం కావడం లేదని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంపీ అవినాష్ పై పలు ఆరోపణలు చేశారు. సునీత వ్యాఖ్యలు కూడా వైసీపీని దెబ్బకొట్టాయన్న చర్చ ఉంది.


  4. క్షేత్ర స్థాయిలో అనేక మంది వైసీపీ నేతలు టీడీపీ కండువా కప్పుకుంటున్నా.. ఆపేందుకు వైసీపీ నేతలు పెద్దగా ప్రయత్నం చేయలేదు.
  5. సొంత నియోజకవర్గంలో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం జరుగుతున్నా.. అధినేత జగన్ పెద్దగా పట్టించుకోలేదన్న ఆవేదన వైసీపీ నేతల్లో వ్యక్తం అవుతోంది. ప్రచారం ముగిసే రోజు వరకు కూడా జగన్ వస్తాడని ఎదురు చూసిన ఆ పార్టీ నేతలకు నిరాశే మిగిలింది. జగన్ ఒక్క సారి పులివెందులకు వచ్చిపోయినా పరిస్థితి వేరేలా ఉండేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 
Advertisment
తాజా కథనాలు