/rtv/media/media_files/2025/04/17/SNe0nvrF1YZPAQoAI89r.jpg)
Samsung Big League sale offers
క్రికెట్ సీజన్‌ను మరింత ఉత్సాహంగా.. ఉత్తేజకరంగా మార్చడానికి.. శామ్‌సంగ్ 'బిగ్ లీగ్' అనే కొత్త సేల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేల్ ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 30, 2025 వరకు కొనసాగుతుంది. దీనిలో కంపెనీ తన ప్రీమియం బిగ్ స్క్రీన్ AI టీవీలపై ప్రత్యేక ఆఫర్‌లను అందిస్తోంది. ఈ టీవీలు గొప్ప స్క్రీన్, శక్తివంతమైన సౌండింగ్‌తో వస్తాయి అని శామ్సంగ్ చెబుతోంది.
Also Read: ఓసారి కలిసి కూర్చుని మాట్లాడుకోండి.. సీఎం విడాకుల కేసుపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
ఈ సేల్‌లో నియో క్యూఎల్‌ఇడి 8కె, నియో క్యూఎల్‌ఇడి 4కె, ఓఎల్‌ఇడి, క్రిస్టల్ 4కె యుహెచ్‌డి వంటి హై-ఎండ్ టీవీ మోడళ్లపై బంపర్ బెనిఫిట్స్ అందిస్తున్నట్లు శామ్‌సంగ్ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. వినియోగదారులు టీవీ కొనుగోలుపై రూ.2,04,990 వరకు విలువైన టీవీని ఉచితంగా లేదా రూ.99,990 వరకు విలువైన సౌండ్‌బార్‌ను ఫ్రీగా పొందవచ్చు. దీనితో పాటు 20% వరకు క్యాష్‌బ్యాక్, జీరో డౌన్ పేమెంట్, రూ. 2,990 నుండి ప్రారంభమయ్యే EMI వంటి ఫైనాన్స్ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి.
Also Read: మందుబాబులకు షాకింగ్ న్యూస్.. పెరగనున్న ధరలు.. ఎంతంటే!?
ఏయే మోడళ్లపై ఆఫర్లు
నియో QLED 8K టీవీ: NQ8 AI Gen2 ప్రాసెసర్‌తో అమర్చబడిన ఈ టీవీ 256 AI నెట్‌వర్క్‌లతో అద్భుతమైన స్క్రీనింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అలాగే సౌండింగ్‌లోనూ అదరగొట్టేస్తుంది. ముఖ్యంగా గేమింగ్, స్పోర్ట్స్ కోసం ఇది మోషన్ ఎక్స్‌సెలరేటర్ టర్బో ప్రో వంటి టెక్నాలజీతో వస్తుంది.
Also Read: టైమ్స్ ప్రభావశీలుర జాబితాలో ట్రంప్,యూనస్...భారతీయులకు దక్కని ప్లేస్!
నియో QLED 4K టీవీ: ఇది NQ4 AI Gen2 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. అలాగే క్వాంటం మ్యాట్రిక్స్ టెక్నాలజీతో వస్తుంది. ఎలాంటి వీడియోనైనా 4Kగా మారుస్తుంది. పాంటోన్ వాలిడేటెడ్ డిస్ప్లే, డాల్బీ అట్మాస్ మద్దతును కలిగి ఉంది. ఈ టీవీ వినియోగదారులకు అద్భుతమైన స్క్రీనింగ్ అనుభవాన్ని, సౌండింగ్‌ను అందిస్తుంది.
QLED TV: ఈ టీవీ క్వాంటం డాట్ టెక్నాలజీతో వస్తుంది. అలాగే 100% కలర్ వాల్యూమ్‌ను అందిస్తుంది. దీని అల్ట్రా-స్లిమ్ డిజైన్ ఏ ఇంటి ఇంటీరియర్‌కైనా స్టైలిష్‌గా కనిపిస్తుంది.
OLED TV: ఈ టీవీ ప్రత్యేకంగా గేమర్స్ - హై-స్పీడ్ కంటెంట్ కోసం తయారుచేయబడింది. ఇందులో గ్లేర్-ఫ్రీ స్క్రీన్, డీప్ బ్లాక్స్, రియల్ డెప్త్ ఎన్‌హాన్సర్, 144Hz మోషన్ ఎక్స్‌సిలరేటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
tv offers | smart-tv-offer | latest-telugu-news | telugu-news