Hari Hara Veera Mallu: వీరమల్లు కోసం పవన్ రేర్ ఫీట్.. ఏకంగా 1100 మందితో

పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’లో 20 నిమిషాల యాక్షన్ సీన్‌ను ఆయన స్వయంగా డిజైన్ చేశారట. మొత్తం 1100 మంది పాల్గొన్న ఈ సీన్‌ సినిమాకే హైలైట్‌గా నిలవనుంది. మే 9న ‘హరి హర వీరమల్లు పార్ట్-1’ విడుదల కానుంది.

New Update
Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan) నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌ చిత్రం ‘హరి హర వీరమల్లు’పై ఆసక్తికర న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమై, ప్రస్తుతం జ్యోతికృష్ణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ కీలక సన్నివేశాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా తెరకెక్కిస్తున్నారట. ఈ విషయాన్నీదర్శకుడు తాజాగా వెల్లడించారు.

Also Read: నందమూరి తమన్ మొదటి జీతం ఎంతో తెలిస్తే షాకే..!

20 నిమిషాల భారీ యాక్షన్ బ్లాక్

అయితే జ్యోతికృష్ణ మాట్లాడుతూ..  ఈ చిత్రంలో మొత్తం 6 యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయట. అయితే, వాటిలో ఒకటి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్‌ డిజైన్ చేశారు. అది కూడా చిన్నది కాదు – సుమారు 20 నిమిషాల పాటు సాగే భారీ యాక్షన్ బ్లాక్. ఈ సీన్‌ కోసం ఏకంగా 1100 మంది నటీనటులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని ప్రైవేట్ స్టూడియోలో 61 రోజుల పాటు చిత్రీకరణ సాగిందని, అంతకుముందు పవన్ తాను స్వయంగా ప్లానింగ్ చేసి, ఇంటర్నేషనల్ స్టంట్ కొరియోగ్రాఫర్లతో చర్చించి ఈ యాక్షన్‌ను సిద్ధం చేశారని వెల్లడించారు.

Also Read: ‘జటాయు’కి ప్రభాస్ సెట్ కాడు..

ఈ విజువల్ ఎక్స్‌పీరియన్స్ సినిమాకే హైలైట్‌గా నిలవబోతుందని చెబుతున్నారు. మరోవైపు, ఈ ప్రాజెక్ట్‌ కోసం పవన్ ప్రత్యేకంగా గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకున్న విషయాన్ని కూడా జ్యోతికృష్ణ పేర్కొన్నారు.

Also Read: యాక్షన్ షురూ.. ఎన్టీఆర్‌ - నీల్‌ సెట్ లో అడుగుపెట్టనున్న యంగ్ టైగర్

ఈ సినిమాలో పవన్‌కు జోడీగా నిధి అగర్వాల్‌ నటిస్తున్నారు. ఆమె కూడా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, సినిమా షూటింగ్‌లో ప్రతి స్టేజ్‌లో పవన్ కల్యాణ్‌ చొరవ ఉంటుందని, తనకు పవన్ కళ్యాణ్ ఎంతో స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు.

Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..

ఈ భారీ బడ్జెట్‌ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. తొలి భాగం పేరు ‘హరి హర వీరమల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. ఇది మే 9న థియేటర్లలో విడుదల కానుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు