ఆంధ్రప్రదేశ్ AP: ఇంకా ఏనాళ్లు వరదలకు ఇబ్బంది పడాలి.. బాధితుల ఆవేదన..! అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో వరద నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ సంవత్సరం వచ్చే వరదలకు తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. కనీసం వచ్చే ఏడాదికైనా తమకు పునరావాసానికి ఇళ్ళు ఏర్పాటు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. By Jyoshna Sappogula 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఆసుపత్రిలో కూలిన పైకప్పు.. రెప్పపాటులో తప్పిన ప్రమాదం..! కాకినాడ జిల్లా తుని ఏరియా ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ విభాగంలో పైకప్పు కూలింది. దీంతో రోగులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పాత భవనం కావడంతో వర్షపు నీరు నిల్వ ఉండడం వల్ల పైకప్పు పెచ్చు ఊడిపడిందన్నారు ఆసుపత్రి సూపరిండెంట్ స్వప్న. By Jyoshna Sappogula 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీలో మరో ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య..! కాకినాడలో అదృశ్యమైన వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగి కాండ్రేగుల రాధాకృష్ణ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యానాం బ్రిడ్జిపై రాధాకృష్ణ చెప్పులు, సెల్ ఫోన్ గుర్తించారు. తన తండ్రి ఆత్మహత్యకు మహిళా ఉద్యోగినే కారణమని కుమారుడు నిఖిల్‌సాయి ఆరోపించారు. By Jyoshna Sappogula 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Boat: సముద్రంలో పడవ బోల్తా.. ఆరుగురు మత్సకారులు! ఐ.పోలవరం మండలం భైరవపాలెం మొగ సమీపంలో సముద్రంలో వేట ముగించుకుని తిరిగి వస్తున్న మత్సకారుల పడవ సముద్రంలో బోల్తా పడింది. వేగంగా వీస్తున్న గాలులకు, ఎగసిపడతున్న అలల తాకిడికి సముద్రంలో బోటు ఆగిపోయింది. ఆ సమయంలోనే పెద్ద అలల తాకిడికి బోటు ఒక్కసారిగా తిరగబడింది. By Bhavana 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: సౌదీ అరేబియాలో ఒంటెల కాపరిగా చిక్కుకున్న కోనసీమ వాసి.. స్వదేశానికి వచ్చేందుకు.. సౌదీ అరేబియాలో చిక్కుకున్న కొనసీమ వాసి వీరేంద్రకుమార్‌ను స్వదేశానికి తీసుకువచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏజెంట్ మోసంతో ఎడారిలో ఒంటెల కాపరిగా చిక్కుకున్న గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్ రేపు మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకుని కోనసీమకు రానున్నాడు. By Jyoshna Sappogula 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ముంపు ప్రాంతాలలో జిల్లా కలెక్టర్.. ఆధికారులకు కీలక ఆదేశాలు..! అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ముంపు ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ పర్యటించారు. ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు. అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. By Jyoshna Sappogula 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వర్ణనాతీతంగా లంక గ్రామాల ప్రజల కష్టాలు.. పసిబిడ్డతో బాలింత పడవ ప్రయాణం..! కోనసీమ జిల్లాలో లంక గ్రామాల ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. చాకల పాలెం - కనకాయలంక కాజ్వే నీట మునిగిపోయింది. దీంతో స్థానికుల పరిస్థితి దయానీయంగా మారింది. గోదావరి వరద ప్రవాహంలో బాలింత పసిబిడ్డతో పడవ ప్రయాణం చేయాల్సి వచ్చింది. By Jyoshna Sappogula 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ధవళేశ్వరం బ్యారేజ్‌కు ఉధృతంగా వరద నీరు.. రెండవ ప్రమాద హెచ్చరిక..! తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. 175 గేట్లను ఎత్తివేసి 10 లక్షల 23 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. సాయంత్రానికి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. By Jyoshna Sappogula 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : సైకిల్‌పై ఆడుకోవడానికి వెళ్లిన బాలుడు.. ఇంతలోనే..! తూర్పుగోదావరి జిల్లా ఉండేశ్వరం గ్రామంలో బాలుడు రాంబాబు వరద నీటిలో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం బాలుడు కోసం గాలింపు చర్యలు చేపట్టింది. ఆడుకోవడానికి వెళ్ళిన రాంబాబు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. By Jyoshna Sappogula 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn