/rtv/media/media_files/2025/04/28/ANAo5sjUzBJiEWLkeOjB.jpg)
sri-reddy kakinada
Sri Reddy : వివాదాస్పద నటి శ్రీరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. కాకినాడలో ఆమెపై కేసు నమోదైంది. ప్రతిపక్షంలో ఉండగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు చేశారంటూ శ్రీరెడ్డిపై టీడీపీ మహిళ నేతలు కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సోమవారం ఫిర్యాదు చేశారు. కాకినాడ జగన్నాథపురానికి చెందిన టీడీపీ మహిళ నాయకురాలు కొప్పనాతి నాగకుమారి ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కేసు నమోదు చేశారు. వైసీపీ అండ చూసుకుని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై శ్రీరెడ్డి అత్యంత దారుణంగా దూషించడంతో ఈ కేసు పెట్టినట్లు ఆమె తెలిపారు. ఆడవాళ్లే సిగ్గుపడలే శ్రీరెడ్డి కామెంట్స్ చేశారని ఆమెను కఠినంగా శిక్షించాలని నాగకుమారి డిమాండ్ చేశారు.
Also Read: Balakrishna Padma Bhushan: బాలయ్య బాబుకు అభినందనల వెల్లువ.. ఎవరెవరు విష్ చేశారంటే?
Also Read: Dhanush 56: పుర్రెతో ధనుష్ కొత్త సినిమా పోస్టర్.. నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ అదే డైరెక్టర్ తో
కాకినాడ: నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు pic.twitter.com/Wx8l66kStM
— Publish7 (@srinuvenka41452) April 28, 2025