/rtv/media/media_files/2025/03/19/jWaQbr2YiWT9i7lcPdV5.jpg)
Weather Department Big Alert andhra pradesh and telangana Rains Photograph: (Weather Department Big Alert andhra pradesh and telangana Rains )
Ap Weather Report: ఏపీలో మరో రెండురోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెబుతుంది. ఈరోజు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. . అలాగే రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also Read: Musk-Trump: ట్రంప్ మీటింగ్‌లో మస్క్ "టాప్ సీక్రెట్" నోట్..అసలు అందులో ఏముంది!
వడగాలులు వీచే అవకాశం
నేడు కాకినాడ 3, కోనసీమ 7, తూర్పు గోదావరి గోకవరం మండలాల్లో తీవ్రవడగాలులు, మరో 98 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందంటున్నారు.ఆదివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు పడ్డాయి. చెట్ల క్రింద నిలబడరాదు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
Also Read: Holiday: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఈ వారంలోనే రెండు సెలవులు!
'ఆదివారం ప్రకాశం జిల్లా దరిమడుగులో 41.8 డిగ్రీలు, కడప జిల్లా ఒంటిమిట్ట, పల్నాడు జిల్లా రావిపాడులో 41.4 డిగ్రీలు, 54 మండలాల్లో 40 డిగ్రీలకుకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు అధికారులు ప్రకటించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 54.7మిమీ, ప్రకాశం కనిగిరిలో 43మిమీ, అల్లూరి జిల్లా బుట్టాయిగూడెంలో 39.5మిమీ వర్షపాతం నమోదైంది' అన్నారు.
ఆదివారం రోజు ఓ వైపు ఎండల తీవ్రత కొనసాగగా.. మరోవైపు అకాల వర్షాలు కురిశాయి. కోస్తాలో పలుచోట్ల ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వానపడింది. ఉత్తరాంధ్రలో అల్లూరి జిల్లా సహా అక్కడక్కడా వడగండ్ల వర్షాలు కురిశాయి. ప్రకాశం జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. దర్శి, ముండ్లమూరు ప్రాంతాల్లో బొప్పాయి తోటలు ధ్వంసమవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కనిగిరిలో నిర్మాణంలో ఉన్న ఇంటి గోడ కూలి డబ్బుగొట్టు వెంకట లక్ష్మమ్మ అనే మహిళ ప్రాణాలు కోల్పోయారు.
ఏలూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. కైకలూరు రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాం-1 పై తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్ రైలు వచ్చిన సమయంలో ఈదురుగాలులతో వర్షం పడింది. ఈ ఈదురుగాలులకు స్టేషన్‌ను ఆనుకుని ఉన్న సరుగు చెట్టు విరిగి విద్యుత్ లైన్‌పై పడి.. రైలు బోగీపై పడింది. దీంతో ప్రయాణికులు హడలిపోయారు.. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే ఆ చెట్టును తొలగించారు.
తెలంగాణలో కూడా మరో రెండు రోజులు వర్షాలు పడతాయని చెబుతున్నారు. రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాం ఉందంటున్నారు. రాష్ట్రంలో రెండు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఈ మేరకు ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Also Read: Trump: కేవలం 30 రోజులే..అమెరికాను విడిచి వెళ్లిపోండి...!
Also Read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ
weather | Andhra Pradesh and Telangana Weather Report | andhra pradesh weather | andhra-pradesh-weather-forecast | andhra-pradesh-weather-report | ap today weather update | ap-weather | AP Weather Alert | srikakulam | west-godavari | east-godavari | east-godavari-district