Pawan Kalyan : భయపడుతున్న పవన్ కొడుకు...ఆ డాక్టర్ తో చికిత్స

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కుమారుడు మార్క్‌ శంకర్‌ సింగపూర్‌లో అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాదం తర్వాత మార్క్‌ శంకర్‌ కోలుకున్నప్పటికీ మానసికంగా ఇంకా ఇబ్బంది పోలేదని, ఇప్పటికీ భయడపడుతున్నాడని పవన్‌ వెల్లడించారు.

New Update
Pawan Kalyan Son Mark Shankar Health Updates

Pawan Kalyan Son Mark Shankar Health Updates

Pawan Kalyan: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కుమారుడు మార్క్‌ శంకర్‌ సింగపూర్‌లో అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. మార్క్‌ శంకర్‌ చదువుతున్న పాఠశాలలో ఒక్కసారిగా మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో శంకర్‌కు గాయాలు కాగా.. ఓ చిన్నారి చనిపోయింది. కాగా నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో పవన్‌ తన కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై స్పందించాడు. ప్రమాదం అనంతరం చికిత్స అందించగా మార్క్‌ శంకర్‌ కోలుకున్నప్పటికీ మానసికంగా ఇంకా ఇబ్బంది పోలేదని, ఇప్పటికీ భయడపడుతున్నాడని పవన్‌ వెల్లడించారు.

Also Read: సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నా, ఏకిపారేయ్యండి .. ప్రధాని మోదీ సంచలనం
 
పవన్‌ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఇంటి వద్దే ఉంటూ.. ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నాడు. శంకర్‌ సురక్షితంగా ఇంటికి చేరడంతో పవన్‌ భార్య అన్నలెజినోవా తిరుపతికి వచ్చి మొక్కు కూడా చెల్లించుకున్నారు. అయితే... సింగపూర్‌ అగ్నిప్రమాదం వల్ల పవన్‌ కుమారుడి ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో కాస్త ఇబ్బందికి గురయ్యాడు. 

Also Read: పాకిస్థాన్‌కు షాక్.. ఇజ్రాయెల్ సాయంతో భారత్ సరికొత్త ప్లాన్ !

డిప్యూటీ సీఎం పవన్‌ ఈరోజు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జరిగిన కార్యక్రమంలో పహల్గాం మృతులకు నివాళులర్పించారు. ఈ సందర్బంగా తీవ్రవాదుల కాల్పుల్లో అన్యాయంగా చనిపోయిన వారి కుటుంబాల పరిస్థితిని ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు. తన కుమారుడికి అగ్ని ప్రమాదం జరిగి సురక్షితంగా ఇంటికి చేరుకున్నప్పటికీ .. ఇప్పటికీ ఆ ఘటన నుంచి శంకర్‌ తేరుకోలేదని అన్నారు పవన్‌. 

Also Read: సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా.. జస్టిస్ బీర్‌ గవాయ్ నియామకం..

ఇప్పటికే రాత్రి వేళ్ల నిద్రలో లేచి.. బిల్డింగ్‌ పైనుంచి పడిపోయినట్లు తన కుమారుడికి కలలు వస్తున్నాయని దీన్ని నయం చేసేందుకు సైకియాట్రిస్ట్‌తో ట్రీట్‌మెంట్‌ చేయిస్తున్నట్లు పవన్‌ పేర్కొన్నారు.  అచ్చం తన కుమారుడిలానే మధుసూధన్ కుటుంబం అన్నారు. ఎంతో సరదాగా గడిపేందుకు పహల్గా వెళ్లారని కానీ ఈ విధంగా జరగడం దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు వాళ్లకు నిద్రపడుతుందా..బుల్లెట్ల శబ్దం కళ్ల ముందు తమ కుటుంబ సభ్యుడు చనిపోవడం ఆ షాక్ నుండి కోలుకోవడం కష్టం అని అన్నారు. ఆ బాధ ఏంటో తనకు తెలుసని చెప్పారు.

ఇది కూడా చూడండి: Russia: రష్యా సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ ప్రకటన

ఇదే విధంగా పహల్గాంలో ఉగ్రవాదుల చేతిలో అయిన వారు కళ్లముందే చనిపోతుంటే.. కుటుంబ సభ్యులు ఎంత భయానకంగా ఫీలయ్యారో ఊహించలేకపోతున్నానని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే బహుశా ఆ పీడకలల నుంచి అనేక కుటుంబాలు బయటకు రాలేదని అలాంటి వారందరికీ తోటి వారు ధైర్యం చెప్పాలని, అండగా ఉండాలని పవన్‌ కల్యాణ్‌ కోరారు. 

ఇది కూడా చూడండి:Waqf Board Assets: వక్ఫ్‌ ఆస్తులు ఆ రాష్ట్రంలోనే ఎక్కువ.. కేంద్రం కీలక ప్రకటన

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు