AP Government: ఏపీలో నామినేటెడ్ పోస్టులు భర్తీ...ఏ పార్టీకి ఎన్నంటే….

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా పార్టీల కార్యకర్తలకు పలు నామినేటెడ్ పోస్టులను కట్టబెడుతోంది. తాజాగా 10 జిల్లాలకు సహకార బ్యాంక్, సహకార మార్కెటింగ్ సంఘాల ఛైర్మన్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

New Update
Nominated Posts

Nominated Posts

Nominated Posts : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా పార్టీల కార్యకర్తలకు పలు నామినేటెడ్ పోస్టులను కట్టబెడుతోంది. తాజాగా 10 జిల్లాలకు సహకార బ్యాంక్, సహకార మార్కెటింగ్ సంఘాల ఛైర్మన్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ, టీడీపీ, జనసేనలు కలసి కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. అధికారం చేపట్టాక మూడు పార్టీలకు చెందిన నాయకులకు పార్టీ లీడింగ్ ను బట్టి నామినేటెడ్ పోస్టులు కేటాయిస్తోంది. కాగా ప్రస్తుతం మొత్తం పదిజిల్లాలకు చెందిన సహకార బ్యాంక్, సహకార మార్కెటింగ్ సంఘాల కు చైర్మన్ లను నియమించగా వీటిలో జనసేనకు రెండు స్థానాలు కేటాయించగా బీజేపీకి ఒక్కస్థానాన్ని కూడా కేటాయించలేదు. మిగిలిన అన్ని స్థానాలకు టీడీపీ నేతలకే కేటాయించడం గమనార్హం.

Also Read: పాకిస్తాన్‌లో 170 న్యూక్లియర్ బాంబులు.. వాటి రిమోట్ ఎవరి చేతిలో ఉందో తెలుసా..?

జిల్లా సహకార బ్యాంకు ఛైర్మన్లుగా శ్రీకాకుళం డీసీసీబీ చైర్మన్‌గా శివ్వల సూర్యనారాయణ(టీడీపీ), విశాఖ డీసీసీబీ చైర్మన్‌గా కోన తాతారావు( జనసేన), విజయనగరం డీసీసీబీ చైర్మన్‌గా కిమిడి నాగార్జున(టీడీపీ),గుంటూరు డీసీసీబీ చైర్మన్‌గా మాకినేని మల్లికార్జునరావు(టీడీపీ), కృష్ణా డీసీసీబీ చైర్మన్‌గా నెట్టెం రఘరామ్‌(టీడీపీ), నెల్లూరు డీసీసీబీ చైర్మన్‌గా ధనుంజయరెడ్డి(టీడీపీ), చిత్తూరు డీసీసీబీ చైర్మన్‌గా అమాస రాజశేఖర్‌రెడ్డి(టీడీపీ), అనంతపురం డీసీసీబీ చైర్మన్‌గా కేశవరెడ్డి(టీడీపీ) , కర్నూలు డీసీసీబీ చైర్మన్‌గా విష్ణువర్థన్‌రెడ్డి(టీడీపీ), కడప డీసీసీబీ చైర్మన్‌గా బి. సూర్యనారాయణరెడ్డి(టీడీపీ)గా నియమితులయ్యారు.

Also Read : పహల్గాం దాడిని పూర్తిగా షూట్‌ చేసిన వీడియోగ్రాఫర్‌.. కానీ

ఇక జిల్లా సహకార మార్కెటింగ్ సంఘాల ఛైర్మన్లుగా శ్రీకాకుళం డీసీఎంఎస్ చైర్మన్‌గా అవినాష్‌ చౌదరి (టీడీపీ), విశాఖడీసీఎంఎస్ చైర్మన్‌గా కొట్ని బాలాజీ(టీడీపీ), విజయనగరం డీసీఎంఎస్ చైర్మన్‌గా గొంప కృష్ణ(టీడీపీ), గుంటూరు డీసీఎంఎస్ చైర్మన్‌గా వడ్రాణం హరిబాబు(టీడీపీ), కృష్ణా డీసీఎంఎస్ చైర్మన్‌గా బండి రామకృష్ణ(జనసేన), నెల్లూరు డీసీఎంఎస్ చైర్మన్‌గా గొనుగోడు నాగేశ్వరరావు(టీడీపీ),చిత్తూరు డీసీఎంఎస్ చైర్మన్‌గా సుబ్రమణ్యం నాయుడు(టీడీపీ), అనంతపురం డీసీఎంఎస్ చైర్మన్‌గా నెట్టెం వెంకటేశ్వర్లు(టీడీపీ), కర్నూలు డీసీఎంఎస్ చైర్మన్‌గా నాగేశ్వరయాదవ్‌(టీడీపీ), కడప డీసీఎంఎస్ చైర్మన్‌గా యర్రగుండ్ల జయప్రకాశ్‌(టీడీపీ)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read: పహల్గాం దాడికి ముందు ఉగ్రవాదులు ఏం చేశారో తెలుసా? వెలుగులోకి సంచలన నిజాలు

Also read: కాంగ్రెస్ వాళ్లను ఉరికిచ్చి కొడతా... ఎర్రబెల్లి దయాకర్ రావు ఫుల్ ఫైర్

Advertisment
తాజా కథనాలు