Pawa Kalyan: ఏపీ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అగ్ర వర్ణాలు దళితులను గ్రామం నుంచి బహిష్కరించడం కలకలం రేపుతోంది. వస్తువులను విక్రయించరాదంటూ హుకుం జారీ చేయడంతో దుకాణదారులు అమ్మకాలు నిలిపివేశారు. ఓ ఇంటి దగ్గర విద్యుత్ పని చేస్తూ షాక్ తగిలి పల్లపు సురేష్ అనే వ్యక్తి చనిపోయాడు. దీంతో మృతుడి కుటుంబసభ్యులు, దళితులు బాధితుడి కుటంబానికి న్యాయం చేయాలంటూ ధర్నా చేశారు. దీంతో గ్రామం నుంచి బహిష్కరించారని దళితులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది కూడా చూడండి: Saraswati Pushkaralu: సరస్వతీ పుష్కరాలు-2025.. సర్కార్ ప్రత్యేక యాప్..ఒక్క క్లిక్ చాలు!
రంగంలోకి దిగిన ఆర్డీవో..
ఈనెల 16న అగ్రవర్ణానికి చెందిన వారి ఇంటి కరెంటు పనిచేస్తూ షాక్ తో పల్లపు సురేష్ చనిపోయాడు. సురేష్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ మల్లం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద దళితులు ధర్నా చేశారు. నష్టపరిహారంగా సుమారు రూ. 2 లక్షల 75 వేల రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించారు. కానీ తాము చేయని తప్పుకి నష్టపరిహారం ఎందుకు చెల్లించాలంటూ అగ్రవర్ణాల పెద్దలు వాదనకు దిగారు. దీంతో దళితులను దూరం పెట్టాలని నిర్ణయించగా.. వస్తువులను విక్రయించరాదంటూ అగ్రవర్ణాలు తీర్మానించాయి. ఆదేశాలు పాటించని వారిపై కూడా చర్యలు తీసుకుంటామని వ్యాపారులకు వార్నింగ్ ఇచ్చారు. ఈ ఇష్యూ మరింత ముదరడంతో పోలీసులు ఇరువర్గాలతో చర్చలు జరిపారు. స్వయంగా ఆర్డీవో రంగంలోకి దిగి దళితులు, అగ్రవర్ణాల వాదనలు విన్నారు. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చినట్లు సమాచారం.
ఇది కూడా చూడండి: Paster praveen: పోలీసులకు వ్యతిరేకంగా KA పాల్ అనుమానాలు.. ఆర్టీవీతో ఎక్స్‌క్లూసివ్ వీడియో
pitapuram | dalith | village | issue | telugu-news | today telugu news