పాస్టర్ ప్రవీణ్ మృతి నేపథ్యంలో మాజీ ఎంపీ హర్షకుమార్ ఈ రోజు రాజమండ్రిలో శాంతిర్యాలీకి పిలుపునిచ్చారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతవారణం నెలకొంది. ర్యాలీ ప్రారంభమయ్యే ప్రవీణ్ చనిపోయిన ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. మరో వైపు హర్షకుమార్ ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి రహస్య ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. పోలీసులు భారీగా మోహరించినా.. పాస్టర్లు మాత్రం భారీగా తరలివచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
హర్ష కుమార్ ను వెంటనే విడుదల చేయాలి: పాల్
హర్షకుమార్ అరెస్టుపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. హర్షకుమార్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ మరణంపై శాంతిర్యాలీ చేయడం తప్పా? అని ప్రశ్నించారు. ప్రవీణ్ పోస్టుమార్టం రిపోర్టును తప్పుగా చూపించారని ఆరోపించారు. ప్రవీణ్ అంత్యక్రియలకు రాకుండా పాస్టర్లను అడ్డుకున్నారని ధ్వజమెత్తారు.
(gv harsha kumar on pastor praveen | telugu-news | telugu breaking news)