Paster praveen: పోలీసులకు వ్యతిరేకంగా KA పాల్ అనుమానాలు.. ఆర్టీవీతో ఎక్స్‌క్లూసివ్ వీడియో

పాస్టర్ ప్రవీణ్ మృతిపై పోలీసులు చెప్పిన దానికి వ్యతిరేకంగా కేఏ పాల్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు చూపించిన వీడియోల్లో ఒక్కచోట కూడా ప్రవీణ్ ఫేస్ కనిపించలేదని ఆయన అన్నారు. దీనిపై సీబీఐ విచారణ చేయించాలని ఆయన RTV ఇంటర్వ్యూలో డిమాండ్ చేశారు.

New Update

పాస్టర్ ప్రవీణ్ మృతిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఆంద్రప్రదేశ్ పోలీసులు ఇచ్చిన పోస్టుమార్టం రిపోర్ట్‌కు వ్యతిరేకంగా ప్రవీణ్‌ది హత్యే అని ఆయన వాదిస్తున్నారు. ప్రవీణ్ మృతిపై సీబీఐ విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ఆర్టీవీతో జరిగిన ఇంటర్వ్యూలో కేఏ పాల్ హత్యకు సంబంధించిన ఆధారాలు కూడా ఆయన దగ్గర ఉన్నాయని చెబుతున్నారు.

Also read: Murder case: కొడుకు అక్రమ సంబంధానికి బలైన తండ్రి.. వాడి పెళ్లం ఫొటోలు వాట్సాప్ స్టేటస్‌

సీసీపుటేజ్‌లో ఒక్క చోటైనా ప్రవీణ్ ఫేస్ కనిపించిందా..: కేఏ పాల్

ఇప్పటికే ఆయన ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ముమ్మాటికీ పాస్టర్ ప్రవీణ్‌ను దారుణంగా మర్డర్ చేశారని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో ప్రవీణ్‌ను చంపి.. యాక్సిడెంట్‌గా చిత్రీకరించారని ఆయన గట్టిగా చెబుతున్నారు. అన్ని వందల సీసీటీవీ పుటేజీల్లో ఒక్క చోటైనా ప్రవీణ్ ముఖం కనిపించిందా అని కేఏ పాల్ అనుమానం వ్యక్తం చేశారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతికి సంబంధించి కేఏ పాల్ అనుమానాలు రేకెత్తిస్తున్నారు. కేఏ పాల్ ఆర్టీవీతో ఎక్స్‌క్లూసివ్ ఇంటర్వ్యూ చూడండి.

Also read: బిట్టూ నువ్ సూపర్ రా..  క్రికెట్‌పై ఇష్టం రూ.3900 కోట్ల ఆస్తిని కాపాడింది..!

( latest-telugu-news | KA Paul | Pastor Praveen | ka paul about pastor praveen)

Advertisment
తాజా కథనాలు