BIG BREAKING: పిఠాపురం వర్మకు తప్పిన పెను ప్రమాదం!-VIDEO
కాకినాడ-ఉప్పాడ బీచ్ రోడ్లో ఎగసిపడుతున్న రాకాసి అలలను పరిశీలించడానికి వర్మ ఈ రోజు వెళ్లారు. ఈ క్రమంలో వర్మను భారీ కెరటం బలంగా తాకింది. అలల తాకిడితో వర్మ కిందపడబోయారు.
కాకినాడ-ఉప్పాడ బీచ్ రోడ్లో ఎగసిపడుతున్న రాకాసి అలలను పరిశీలించడానికి వర్మ ఈ రోజు వెళ్లారు. ఈ క్రమంలో వర్మను భారీ కెరటం బలంగా తాకింది. అలల తాకిడితో వర్మ కిందపడబోయారు.
వినాయక చవితి వచ్చిందంటే చాలు రకరకాల వినాయక విగ్రహాల ప్రతిమల ప్రతిష్టించి పూజించటం చూస్తాం.. పోట్టపై పొత్తి కడుపులో.. బొజ్జ గణపయ్యాను ఎప్పుడైనా చూసారా.. ఇదిగో కాకినాడ స్థానిక ఆదిగురు యోగపీఠానికి చెందిన యోగా గురువు సద్గురు సచ్చిదానంద యోగి ఈ అద్భుతాన్ని చేసి చూపారు.
పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం తెలికిచెర్ల గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన అశ్లీల నృత్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ వీడియోల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వినాయక చవితి ఈవెంట్లో పాల్గొనేందుకు నెల్లూరుకు వెళ్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో కంటైనర్ అతివేగంతో టాటా మ్యాజిక్‌ను ఢీకొట్టడంతో స్పాట్లోనే డ్యాన్స్ మాస్టర్‌తో పాటు, డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాకినాడ జిల్లా తునిలో విషాద సంఘటన చోటు చేసుకుంది. రైలు ఢీకొని తండ్రీకొడుకులు దుర్మరణం పాలయ్యారు. మృతులను గుంటూరు జిల్లా పాయకరావుపేటకు చెందిన అనిల్ (30), అతని కుమారుడు అర్జున్ (5)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. భార్య కాపురానికి రావడంలేదని అత్తమామలను అత్యంత కిరాతకంగా హతమార్చాడు అల్లుడు! ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వాయువ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడటం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. విశాఖపట్నం, మన్యం, కోనసీమ, అనకాపల్లిలో రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఏపీలో ఓ వ్యక్తి ఐదేళ్ల క్రితం పెళ్లి చేసుకుని మళ్లీ రెండో వివాహానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం మొదటి భార్య వధువు కుటుంబ సభ్యులకు చెబుతుందని భయపడి ఆ వ్యక్తి పెళ్లి కొన్ని గంటల్లో జరుగుతుందనగా పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.