Crime: ఏపీలో జంట హత్యల కలకలం.. నడిరోడ్డుపై అత్తమామ గొంతు కోసి!

తూర్పుగోదావరి జిల్లాలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. భార్య కాపురానికి రావడంలేదని అత్తమామలను అత్యంత కిరాతకంగా హతమార్చాడు అల్లుడు! ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

New Update

Crime: ఈ మధ్య సమాజంలో నేరాలు, ఘోరాల సంఖ్య బాగా పెరిగిపోయింది. పరువు, ప్రతీకారాలు పేరుతో మనుషులు ఒకరినొకరు చంపుకుంటున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. క్షణికావేశంలో కట్టుకున్న వారిని, కన్నబిడ్డలను కడతేరుస్తున్నారు కొందరు మూర్ఖులు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. 

భార్య కాపురానికి రావడంలేదని అత్తమామలను అత్యంత కిరాతకంగా హతమార్చాడు అల్లుడు! ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..  తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల  మండలం గంటవారిగూడెం గ్రామానికి చెందిన బాబురావు, శారద  దంపతులకు  కుమార్తె నాగేశ్వరికి   దెందులూరు మండలం గంగన్నగూడెంకి చెందిన రామకోటేశ్వర రావుతో 14 ఏళ్ళ క్రితం వివాహం జరిగింది. వీరిద్దరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. 

అయితే  కొంతకాలంగా  భర్తతో మనస్పర్ధలు ఉండడంతో నాగేశ్వరి తల్లిదండ్రులతో కలిసి పుట్టింట్లోనే  ఉంటుంది. కాగా,  తాజాగా భర్త రామకోటేశ్వర రావు భార్యను కాపురానికి తీసుకెళ్లేందుకు అత్తారింటికి వచ్చాడు.  భార్యను కాపురానికి పంపాలని ఆమె తల్లిదండ్రులను అడిగాడు. కానీ, కూతురిని అతడితో పంపేందుకు అత్తమామలు నిరాకరించారు. దీంతో అల్లుడు  రామకోటేశ్వర రావు, అత్తమామల  మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో క్షణికావేశానికి లోనైనా రామకోటేశ్వర రావు దారుణానికి తెగబడ్డాడు. తన  వెంట తెచ్చుకున్న కత్తితో అత్తమామలను పీక కోసి చంపాడు.   చంపడమే కాకుండా పోలీసుల వచ్చేంతవరకు మృతదేహాల దగ్గరే కూర్చున్నాడు. ఈ జంట హత్యలతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అల్లుడు రామకోటేశ్వర రావు అరెస్టు చేశారు. 

Also Read:Venu Swamy: వేణుస్వామిని గుడి నుంచి తరిమేసిన అర్చకులు.. కామాఖ్యా ఆలయంలో షాకింగ్ ఘటన!

Advertisment
తాజా కథనాలు