AP News: మరికొన్ని గంటల్లో పెళ్లి.. ఇంతలోనే వరుడు మిస్సింగ్.. ఎందుకంటే?

ఏపీలో ఓ వ్యక్తి ఐదేళ్ల క్రితం పెళ్లి చేసుకుని మళ్లీ రెండో వివాహానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం మొదటి భార్య వధువు కుటుంబ సభ్యులకు చెబుతుందని భయపడి ఆ వ్యక్తి పెళ్లి కొన్ని గంటల్లో జరుగుతుందనగా పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

New Update
Marriage

Marriage

ఈ మధ్య కాలంలో పెళ్లి పీటల మీదకు వెళ్లినంత వరకు కూడా వివాహం జరగడం డౌటే. కొన్ని పెళ్లిళ్లు అసలు జరగకుండానే ఆగిపోతున్నాయి. ఇలాంటి ఘటన ఇటీవల ఏపీలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా(east-godavari) దేవరపల్లి మండలంలోని యాదవోలు గ్రామంలో పెళ్లికి ముందు ఓ పెళ్లి కొడుకు మిస్ అయ్యాడు. ఈ రోజుల్లో ఉద్యోగం, ఆస్తి వంటివి చూసి పెళ్లి చేసుకుంటున్నారు. అబ్బాయి ఎలాంటివాడు, ఎలా ఉంటాడనే కనీసం తెలుసుకోకుండా అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేస్తారు. కొందరికి పెళ్లికి ముందే అయితే మరికొందరికి పెళ్లి తర్వాత రంగులు బయటపడతాయి. ఈ యువతి అదృష్టం ఏమో.. పెళ్లికి ముందే పెళ్లికొడుకు రియల్ కలర్స్ బయటపడ్డాయి. పాలి సత్యనారాయణ అనే ఓ యువకుడు భీమలు గ్రామానికి చెందిన ఓ యువతితో పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు. మరికొన్ని గంటల్లో పెళ్లి జరగనుందనగా సడెన్‌గా అబ్బాయి మిస్ కావడంతో వెలుగులోకి కొన్ని విషయాలు వచ్చాయి. 

ఇది కూడా చూడండి:  ఉత్తరప్రదేశ్‌లో దారుణం..  దివ్యాంగురాలిని వేటాడి, వెంటాడి మరీ అత్యాచారం!

భర్త చనిపోయిన ఓ మహిళను..

ఐదేళ్ల కిందట భర్త చనిపోయిన ఓ మహిళను సత్యనారాయణ పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాన్ని పెళ్లికూతురికి చెప్పకుండా రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న మొదట భార్య పెళ్లి కూతురు కుటుంబానికి చెబుతుందని సత్యనారాయణ భయపడి కొన్ని గంటల్లో పెళ్లి జరుగుతుందని అనగా పరారయ్యాడు. పెళ్లి చేసుకుని కూడా రెండో పెళ్లికి రెడీ కావడంతో సత్యనారాయణపై పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి కొన్ని గంటల్లో జరగనుండగా సత్యనారాయణ పారిపోవడానికి కారణం ఏంటనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

ఇది కూడా చూడండి:  అన్యమతస్థుడితో అక్రమసంబంధం.. అడ్డుగా ఉన్నాడని 10 ఏళ్ల కొడుకును లేపేసిన తల్లి!

కుటుంబం, అబ్బాయి గురించి తెలుసుకోకుండా..

ప్రస్తుతం రోజుల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. మోసం చేసి మరి పెళ్లిళ్లు(Marriages) చేసుకుంటున్నారు. అలాగే అమ్మాయి తల్లిదండ్రులు ఒకప్పుడు అన్ని విషయాలు ముందు తెలుసుకునే వారు. కుటుంబ సభ్యులు ఎలాంటి వారనే విషయాన్ని తెలుసుకోవడం లేదు. ఆస్తి, ఉద్యోగం జీవితం సాఫీగా సాగిపోతుందని కనీసం ఎంక్వైరీ కూడా చేయట్లేదు. ఆ తర్వాత నిజాలు తెలుసుకుని బాధపడుతున్నారు. అదృష్టం ఉన్నవారికి పెళ్లికి ముందే అన్ని విషయాలు తెలుస్తాయి. కొందరు మాత్రం పెళ్లి చేసుకుని సమస్యలను ఎదుర్కొంటారు. పెళ్లి చేసుకునే ముందు అన్ని విషయాలు సరిగ్గా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు