BIG BREAKING: పిఠాపురం వర్మకు తప్పిన పెను ప్రమాదం!-VIDEO

కాకినాడ-ఉప్పాడ బీచ్ రోడ్లో ఎగసిపడుతున్న రాకాసి అలలను పరిశీలించడానికి వర్మ ఈ రోజు వెళ్లారు. ఈ క్రమంలో వర్మను భారీ కెరటం బలంగా తాకింది. అలల తాకిడితో వర్మ కిందపడబోయారు.

New Update
Pitapuram Varma Accident

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ కీలక నేత వర్మకు తృటిలో పెను ప్రమాదం తప్పిది. కాకినాడ-ఉప్పాడ బీచ్ రోడ్లో ఎగసిపడుతున్న రాకాసి అలలను పరిశీలించడానికి ఆయన ఈ రోజు వెళ్లారు. ఈ క్రమంలో వర్మను భారీ కెరటం బలంగా తాకింది. అలల తాకిడితో వర్మ కిందపడబోయారు. వర్మతో పాటు, ఆయన అనుచరులు కూడా తడిచి ముద్దయ్యారు. దీంతో ఏమవుతుందో తెలియక అక్కడ ఉన్న వారంతా ఆందోళనకు గురయ్యారు. ఎవరికీ ఏం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇది కూడా చదవండి:Andhra Pradesh: దసరా నుంచి నెలకు రూ.15వేలు.. AP సర్కార్ కొత్త పథకం

గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పిఠాపురం టికెట్ దక్కుతుందని పుట్టెడు ఆశ పెట్టుకున్నారు వర్మ. కానీ జనసేనతో పొత్తు కారణంగా ఆయన ఆశలు అడియాశలు అయ్యాయి. ఏకంగా ఆ పార్టీ అధినేత పవన్ అక్కడి నుంచి పోటీ చేయాలని డిసైడ్ అవ్వడంతో వర్మ సైడ్ అవ్వాల్సి వచ్చింది. కూటమి నుంచి బరిలోకి దిగిన పవన్ కు ఆయన ఫుల్ సపోర్ట్ చేశారు. ఆయన గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించారు. పొత్తుకోసం టికెట్ త్యాగం చేసిన వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. కానీ ఆ హామీ ఇంత వరకు నెరవేరకపోవడంతో వర్మ చాలా రోజుల పాటు నిరాశలో ఉండి పోయారు. కనీసం కార్పొరేషన్ పదవి అయినా దక్కకపోవడం ఆయనకు ఇబ్బందిగా మారింది. మరో వైపు నియోజకవర్గంలో జనసేన నేతలు వర్మను పట్టించుకోకపోవడం కూడా చర్చనీయాంశమైంది.

త్వరలో వర్మకు కీలక పదవి..

అయితే వర్మ మాత్రం అవన్నీ పట్టించుకోవడం మానేశారు. రాజకీయ అంశాలను పక్కన పెట్టి తనదైన శైలిలో ప్రజల్లోకి వెళ్లడం ప్రారంభించారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు చేయించడం, ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించడం, ఏమైనా సమస్యలు ఉంటే అధికారులతో మాట్లడి పరిష్కరించడం లాంటివి చేస్తూ తన ప్రత్యేకత చాటుతున్నారు వర్మ. అయితే.. ఇటీవల చంద్రబాబును కలిశారు వర్మ. ఆ కొద్ది రోజులకే ఆయనకు ప్రభుత్వం గన్ మెన్ లను కేటాయించింది. దీంతో ఆయనకు కార్పొరేషన్ పదవి రాబోతుందని చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో మరింత ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్తున్నారు వర్మ. 

Advertisment
తాజా కథనాలు