/rtv/media/media_files/2025/09/04/ap-recording-dance-2025-09-04-13-45-31.jpg)
AP Recording Dance
ఆంధ్రప్రదేశ్‌లో రికార్డింగ్ డ్యాన్సులు (అశ్లీల నృత్యాలు) సర్వ సాధారణం. వీటిపై కఠినమైన నిబంధనలు ఉన్నప్పటికీ పండుగలు, పబ్బాలు.. ఇతర కార్యక్రమాలకు వీటిని చాలా రహస్యంగా నిర్వహిస్తుంటారు. అయితే కొన్నిసార్లు నిబంధనలు ఉల్లంఘించి రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహిస్తే.. నిర్వాహకులపై, కళాకారులపై కేసులు నమోదు చేస్తారు. అంతేకాకుండా డీజేలను సైతం పోలీసులు స్వాధీనం చేసుకోవడం, జరిమానాలు విధించడం వంటి చర్యలు తీసుకుంటారు.
AP Recording Dance
అయితే ఈ మధ్య కాలంలో ఏపీలో రికార్డింగ్ డ్యాన్సుల కార్యక్రమాలు ఎక్కువైపోయాయి. పెళ్లిళ్లు, ఫెస్టివల్స్, సాంస్కృతిక, భక్తి కార్యక్రమాలకు ఈ డ్యాన్సుల ఈవెంట్లు పెరిగిపోయాయి. అయితే అశ్లీల నృత్యాలు, అసభ్యకరమైన సంభాషణలు వంటివాటిపై పూర్తి నిషేధం ఉండటంతో చాలా మంది ఒక చిన్న ప్రోగ్రామ్‌లా మొదలు పెట్టి.. చివరికి వాటిని రికార్డింగ్ డ్యాన్సులుగా మార్చడం వంటివి జరుగుతున్నాయి.
టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ప.గో జిల్లా నల్లజర్ల మండలం తెలికిచెర్లలో వినాయక నిమజ్జనంలో అశ్లీల నృత్యాలు
— greatandhra (@greatandhranews) September 4, 2025
టీడీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన హిందూ సంఘాలు pic.twitter.com/09P6n6EsdQ
ఇటీవల కాలంలో కొన్ని జిల్లాల్లో.. మరీ ముఖ్యంగా పశ్చిమ గోదావరి, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఇలాంటి ఘటనలు నిమజ్జనం, ఆలయ ఉత్సవాల సందర్భంగా ఎక్కువగా వెలుగులోకి వచ్చాయి. పోలీసులు ఈ ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. స్థానిక ప్రజలు, భక్తులు కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదని సూచిస్తున్నారు. కానీ ఈ కార్యక్రమాలు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి.
తాజాగా అలాంటిదే మరొకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం తేలికచర్ల గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన అశ్లీల నృత్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ వీడియోలో కొందరు యువతులు వినాయక నిమజ్జన ఊరేగింపులో అసభ్యకరమైన దుస్తులు ధరించి అశ్లీల నృత్యాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
పవన్ కల్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ లోని కెవ్ కేక సాంగ్‌కు ఆ యువతులు డ్యాన్సులు వేశారు. ఆ సాంగ్‌కు అత్యంత అసభ్యకరంగా కాలు లేపుతూ యువకులను ఉర్రూతలూగించారు. అందుకు సంబంధించిన వీడియోలు వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చక్కర్లు కొట్టాయి. దీంతో పవిత్రమైన పండుగ సందర్భంగా జరిగిన ఈ ఘటనపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది పండుగ పవిత్రతను దెబ్బతీస్తుందని, సంప్రదాయాలకు విరుద్ధమని చాలామంది ఫైరవుతున్నారు.
దీంతో ఆ వీడియోలు వైరల్ అయిన వెంటనే నల్లజర్ల పోలీసులు రియాక్ట్ అయ్యారు. వెంటనే ఆ కమిటీ నిర్వహకులపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.