Weather Update: మరో గంటలో తెలుగు రాష్ట్రాల్లో కండపోత వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!

వాయువ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడటం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. విశాఖపట్నం, మన్యం, కోనసీమ, అనకాపల్లిలో రెడ్ అలర్ట్ జారీ చేసింది.

New Update
Rains

Rains

వాయువ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడటం వల్ల ఏపీలోని విశాఖపట్నంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, బాపట్ల, ప్రకాశం, నంద్యాల, తిరుపతి, నెల్లూరు, కడప, అనంతపురంలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా విశాఖపట్నం, మన్యం, కోనసీమ, అనకాపల్లిలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే తెలంగాణలో కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఇది కూడా చూడండి: Delhi Highway Projects: ఢిల్లీలో అభివృద్ధిని చూసి వాళ్లు ఓర్వలేక పోతున్నారు: ప్రధాని మోదీ

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

ఇకపోతే ఏపీతో పాటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 24 గంటల్లో హైదరాబాద్‌, యాదాద్రి, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, ములుగు, భద్రాద్రి కొత్త గూడెం, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజమాబాద్, రంగారెడ్డిలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌లో మాదాపూర్, గచ్చిబౌలి, అమీర్‌పేట్, యూసుఫ్ గూడ, మధురానగర్, మియాపూర్, కూకట్‌పల్లి, పటాన్ చెరువు, బేగంపేట్, దిల్‌సుఖ్ నగర్, హైటెక్ సిటీలో కుండపోత వర్షాలు  కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

కుండపోత వర్షాల కారణంగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని తెలిపారు. ముఖ్యంగా మత్స్య కారులు వేటకు వెళ్లకూడదని అధికారులు జాగ్రత్తలు తెలిపారు. 

ఇది కూడా చూడండి: High BP And Kidney: అధిక రక్తపోటు, కిడ్నీ రోగులకు శుభవార్త.. పండ్లు, కూరగాయలతో మెరుగైన ఆరోగ్యం

Advertisment
తాజా కథనాలు