🔴Live News: వర్షిణీ వస్తున్నా.. అందరి అంతు తేలుస్తా - అఘోరీ సంచలన వీడియో
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గురువారం (ఈరోజు) మధ్యాహ్నం ఆకాశంలో మేఘావృతమైంది. క్యుములోనింబస్ మేఘాల కారణంగా భారీ వర్షం కురుస్తోంది. టోలిచౌకి, మెహదీపట్నం ఏరియాలో వర్షం కురిస్తోంది. బంజారాహిల్స్, మాదాపూర్‌లో కుండపోత వర్షం పడుతోంది.
ఈ మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురవబోతున్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణాలోని పలు జిల్లాల్లో రాగల 3 రోజులు ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
ఇండియాలో ఏప్రిల్, జూన్ మధ్య సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని IMD చీఫ్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. అధిక హీట్‌వేవ్ కారణంగా ఈ సీజన్లో సుమారు 10 శాతం వరకు విద్యుత్తు డిమాండ్ పెరగనున్నాయట. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వేడి త్రీవత ఎక్కువ.
నేడు ఏపీ, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. వర్షాలకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
వాతావరణ శాఖ తెలంగాణలో అన్నీ జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరో వారం రోజులలో రాష్ట్రంలో అక్కడక్కడా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వనుందట. ఆదివారం (నిన్న) అత్యధికంగా నల్గొండ జిల్లా చిట్యాలలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని APSDMA హెచ్చరికలు చేసింది. అల్లూరి, పశ్చిమ గోదావరి జిల్లాలోని 143 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపనుంది. బుధవారం దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నంద్యాల జిల్లా ఆత్మకూరులో 40.9 డిగ్రీలు నమోదైయ్యాయి.
నాగర్ కర్నూల్ అమ్రాబాద్ రిజర్వు టైగర్ అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దోమల పెంట అటవీ క్షేత్ర పరిధిలో కార్ చిచ్చు మొదలైనట్లు స్థానికులు తెలిపారు. శ్రీశైలం, నల్లమలలోకి ఈ మంటలు ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.