Ap Rain Alert: ఏపీలో మరో రెండు రోజులు పాటు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్

ఏపీలో మరో రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖా హెచ్చరించింది. విశాఖపట్నం, ఎన్టీఆర్, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, పల్నాడు, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్ష సూచన ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది.

New Update
Rain Alert : తెలంగాణలో భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

AP Rains

ఏపీలోని పలు జిల్లాలో  సోమవారం, మంగళవారం  మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖా హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు ఉదయం కాకినాడ, చొల్లంగిపేట, పలు ప్రాంతాల్లో20మిమీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇదే వాతావరణం మరో రెండు రోజుల పాటు కొనసాగనున్నట్లు ఏపీ విపత్తుల శాఖ వెల్లడించింది. ఆదివారం పిడుగుపాటు వర్షాల కారణంగా పలు జిల్లాలో మొత్తం ఎనిమిది మంది చనిపోయారు. 

Also Read :  చావు భయం.. నదిలో దూకి ప్రాణాలు పోగొట్టుకున్న ఉగ్రవాది- వీడియో చూస్తే

Also Read :  కాళ్ల బేరానికి దిగిన పాకిస్తాన్.. ఐక్యరాజ్య సమితి ఎమర్జెన్సీ మీటింగ్

ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్ 

విశాఖపట్నం, ఎన్టీఆర్, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, పల్నాడు,  శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు  జిల్లాల్లో  వర్షాలు పడనున్నట్లు సూచించింది. అలాగే  కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని సూచన ఉన్నట్లు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు సంభవించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈదురుగాలుల సమయంలో ఇంటి నుంచి బయటకు రావద్దని, చెట్లు, విద్యుత్ తీగల కింద ఉండకూడదని హెచ్చరించింది. 

Also Read :  ఏపీ పేదలకు గుడ్ న్యూస్.. ‘అన్నదాత సుఖీభవ’ పథకంపై సీఎం కీలక ప్రకటన!

Also Read :  ఇండియన్ ఆర్మీ సంచలన నిర్ణయం.. సరిహద్దుకు అదనంగా సైన్యం

 

ap rains alert | AP Weather Alert | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu | andhra-pradesh-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు