HYD RAIN
HYD RAIN: ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించింది. పలు రహదారులపై నీరు నిలిచిపోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోపెడ్‌లు, ఆటోల్లో ప్రయాణిస్తున్న వారు వర్షం మధ్య నిలిచిపోవాటం వల్ల నగర ప్రజలు అవస్థలు పడుతున్నారు. వాహనాలు నెమ్మదిగా కదలడంతో రద్దీ ఎక్కువైంది.
మోస్తరు వర్షాలు కురిసే అవకాశం..
ఈ వర్షాలకు కారణం ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి మారాఠ్వాడా, తెలంగాణ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి అని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: మొలకెత్తిన వెల్లుల్లి తింటే ఏమవుతుంది?
ఈ రోజు రాత్రి సమయంలో ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ 21 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయగా, 12 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. రేపు ఖమ్మం, నల్లగొండ, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, హనుమకొండ జిల్లాల్లో కూడా ఇదే తరహా వర్షాలు పడే అవకాశముంది. దీంతోపాటు 10 జిల్లాలకు రేపు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. వర్షం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైన పనులు తప్పించి బయటకు రావద్దని సూచించారు.
ఇది కూడా చదవండి: కొవ్వును కరిగించే చింతకాయలు..ఇంకా బోలెడు లాభాలు
( hyd-rain | latest-news | telugu-news | rain )
 Follow Us
 Follow Us