Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో వానలే వానలు
పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ కారణంగా ఏపీ, తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం వల్ల హైదరాబాద్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.