Telangana: న్యూఇయర్‌ వేడుకలపై సజ్జనార్ సంచలన ప్రకటన.. రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు

మరికొన్నిరోజుల్లో న్యూ ఇయర్ వేడుకలు జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సీవీ సజ్జనార్‌ కీలక ప్రకటన చేశారు. రూల్స్‌ ఉల్లంఘించి హోటల్స్‌, రెస్టరెంట్లు, పబ్‌లు నడిపిస్తే వాటి లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.

author-image
By B Aravind
New Update
CP Sajjanar

CP Sajjanar

మరికొన్నిరోజుల్లో న్యూ ఇయర్ వేడుకలు జరగనున్న నేపథ్యంలో  హైదరాబాద్ సీపీ సీవీ సజ్జనార్‌ కీలక ప్రకటన చేశారు.  రూల్స్‌ ఉల్లంఘించి హోటల్స్‌, రెస్టరెంట్లు నడిపిస్తే వాటి లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. అలాగే నగరంలో డ్రగ్స్‌ నియంత్రణపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు పేర్కొన్నారు. జీరో డ్రగ్స్ విధానమే టార్గెట్‌గా కఠినంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ కమాండ్‌ కంట్రోల్ సెంటర్‌లో శుక్రవారం ఆయన టాస్క్‌ఫోర్స్‌, స్పెషల్ బ్రాంచ్‌ తదితర విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

Also Read: నూరేళ్ల కమ్యూనిస్టు ప్రస్థానం..ఉద్యమ గమనంలో...గెలుపోటములు..చీలికలు

ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రగ్స్ వాడకాన్ని ఉపేక్షించేదే లేదని అన్నారు. శుక్రవారం నుంచే హైదరాబాద్‌లో పబ్‌లు, హోటళ్లు, రెస్టరెంట్లు, ఈవెంట్లు జరిగే జరిగే ప్రదేశాల్లో స్పెషల్‌ నిఘా టీమ్‌లను మోహరించామని తెలిపారు. అంతేకాదు సర్వీస్ అపార్ట్‌మెంట్లు, హాస్టళ్లలో జరిగే ప్రైవేట్ పార్టీలపై కూడా నిఘా ఉంటుందని చెప్పారు. గత రెండేళ్లలో డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్నవారి కదలికలు గమనిస్తున్నామని.. డ్రగ్స్ సరఫరా చేసేవారు, వాటికి అలవాటు పడ్డ వారి లిస్ట్‌ను సిద్ధం చేయాలని చెప్పారు. వాళ్లపై నిరంతరం నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. అలాగే నగరానికి కొత్తగా వచ్చే వారి వివరాలు కూడా ఆరా తీస్తున్నామని పేర్కొన్నారు. 

Also read: 16 ఏళ్ల లోపు పిల్లలపై సోషల్ మీడియాను నిషేధించాలి.. కేంద్రానికి సూచించిన హైకోర్టు

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హోటళ్లు, రెస్టరెంట్లు, పబ్‌లు రాత్రి ఒంటి గంటకు మూసీ వేయాలని ఆదేశించారు. ఎవరైనా రూల్స్‌ ఉల్లంఘిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే వాళ్ల లైసెన్స్‌లు కూడా రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. మైత్రీవనం, నెక్లెస్ రోడ్డు, కేబీఆర్ పార్క్, ట్యాంక్‌బండ్‌తో పాటు జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో చెక్‌పోస్టులు, బారికేడ్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిఘా ఉండాలని.. వేడుకలు ప్రశాంతగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. 

Advertisment
తాజా కథనాలు