YCP MLC Duvvada Srinivas : MLC దువ్వాడ శ్రీనివాస్‌కు ప్రాణహాని?

శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ కు ప్రాణహాని ఉందని శ్రీనివాస్‌తో పాటు దివ్వెల మాధురి ఆరోపిస్తున్నారు. దువ్వాడను చంపేందుకు కుట్ర జరుగుతోందని మాధురి ఆరోపించారు. కింజరాపు అప్పన్న అనే వ్యక్తితో దివ్వెల మాధురి ఆడియో లీక్ అయింది.

New Update
Duvvada Madhuri Srinivas

Duvvada Srinivas-Divvala Madhuri

YCP MLC Duvvada Srinivas : శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ కు ప్రాణహాని ఉందని శ్రీనివాస్‌తో పాటు దివ్వెల మాధురి ఆరోపిస్తున్నారు. దువ్వాడను చంపేందుకు కుట్ర జరుగుతోందని మాధురి ఆరోపించారు. కింజరాపు అప్పన్న అనే వ్యక్తితో దివ్వెల మాధురి ఆడియో లీక్ అయింది. దువ్వాడను కొట్టే ప్రయత్నం జరుగుతోందని..అప్పన్న అనే వ్యక్తి  దివ్వెల మాధురికి ఫోన్‌లో చెప్పడం కలకలం రేపింది. నరసన్నపేట-నిమ్మడ జంక్షన్ల వద్ద..దువ్వాడను కొట్టేందుకు స్కెచ్‌వేస్తున్నట్లు ఆయన మాధురి తో చెప్పిన ఆడియో లీకు కావడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా కాల్‌ చేసిన కింజరాపు అప్పన్న అచ్చెన్నాయుడు సమీప బంధువు కావడం గమనార్హం.

ధర్మాన కృష్ణదాసు అనే వ్యక్తి ఇంటికి వెళ్లిన సమయంలో శ్రీనివాస్‌ ఎక్కువ చేస్తున్నాడని, జాగ్రత్తగా ఉండమని చెప్పాలని సదరు అప్పన్న అనే వ్యక్తితో అన్నట్లు తెలుస్తోంది.దువ్వాడ శ్రీనివాస్‌ ను ఎలాగైన కొట్టాలని ప్రయత్నం జరుగుతుందని ఆయన వెల్లడించడంతో శ్రీనివాస్‌, మాధురి అలర్ట్‌ అయ్యారు. కేవలం వాస్తవాలు మాట్లాడుతున్నందుకే తమపై దాడులు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని దువ్వాడ శ్రీనివాస్‌ ఆరోపించారు. జగన్‌మోహన్‌ రెడ్డిమీద ఉన్న అభిమానంతో జిల్లాలో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నిస్తు్న్నాందుకే తనను హత్య చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కాగా తనకు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాసులతో ప్రాణహాని ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసు అధికారులకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు