Weather Update: ముంచుకొస్తున్న భారీ వర్షాలు.. మరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు
వాయవ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని దీని వల్ల ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావం వల్ల మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.