Weather Update: చలి చంపేస్తోంది బాబోయ్.. వచ్చే 10 రోజులు తెలంగాణలో వణుకే..!

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రంగా పెరిగి పొగమంచు వాహనాలకు ఇబ్బంది పెడుతోంది. అల్లూరి జిల్లాలో 10-12 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. తెలంగాణలో వచ్చే 10 రోజులు చలి మరింత పెరిగి సింగిల్ డిజిట్ వరకు చేరుతుందని వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది.

New Update
Weather Update

Weather Update

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా తెల్లవారుజామున, సాయంత్ర సమయాల్లో పొగమంచు దట్టంగా కమ్మేస్తుండడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైవేలు, ప్రధాన రహదారులు మంచుతో కప్పబడిపోవడంతో వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. హెడ్‌లైట్లు వేసి ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

రోజు సాయంత్రం మొదలవుతున్న చలి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు కొనసాగుతోంది. బయటకు వెళ్లాలంటే గజగజలాడేలా చేసే పరిస్థితి. డిసెంబర్ పూర్తయ్యి జనవరి దగ్గర పడేకొద్దీ చలి మరింత పెరుగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 

అల్లూరి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు

ఏపీ ఏజెన్సీ ప్రాంతాల్లో చలి బాగా పెరుగుతోంది. ముఖ్యంగా అల్లూరి జిల్లాలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి.

  • జి.మాడుగుల - 10 డిగ్రీలు
  • అరకు - 11 డిగ్రీలు
  • పాడేరు - 12 డిగ్రీలు
  • చింతపల్లి - 12.5 డిగ్రీలు

ఈ ప్రాంతాల్లో రోజువారీ జీవితం కష్టంగా మారింది. జిల్లా అధికారులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

తెలంగాణలో 10 రోజుల బిగ్ అలర్ట్

తెలంగాణలో కూడా చలి పంజా వేసింది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రావడం చాలా కష్టం అవుతోంది. వాతావరణ శాఖ అధికారులు రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్ జారీ చేశారు. వచ్చే పదిరోజులు చలి తీవ్రత భారీగా పెరుగుతుందని తెలిపారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతాయని హెచ్చరించారు.

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇప్పటికే టెంపరేచర్లు భారీగా పడిపోతున్నాయి.

  • కుమ్రంభీం ఆసిఫాబాద్: 10 డిగ్రీలు
  • అదిలాబాద్: 10.8 డిగ్రీలు
  • సిర్పూర్: 10.4 డిగ్రీలు
  • నిర్మల్: 12.7 డిగ్రీలు

ఇతర జిల్లాలు కూడా 13 డిగ్రీల చుట్టుపక్కలే ఉన్నాయి. హైదరాబాద్‌లో కూడా చలి ప్రభావం భారీగానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. శంషాబాద్, చేవెళ్ల, మొయినాబాద్ ప్రాంతాల్లో 5–8 డిగ్రీలు హెచ్సీయూ, నానకరామ్‌గూడ, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో 6–8 డిగ్రీలు నమోదవుతాయని అంచనా. రాష్ట్రంలో రెండో దశ కోల్డ్ వేవ్(Cold Wave in Telangana) ప్రారంభమైందని నిపుణులు హెచ్చరించారు. చిన్నపిల్లలు, వృద్ధులు తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు