Weather: విభిన్న వాతావరణం.. ఉత్తర భారత్‌లో పెరగనున్న ఉష్ణోగ్రతలు, దక్షిణాదికి వర్షాలు

దేశంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఫిబ్రవరి మూడోవారం ముగుస్తున్న నేపథ్యంలో ఉత్తర భారత్‌ క్రమంగా వేసవిలోకి అడుగులేస్తోంది. కానీ దక్షిణ భారత్‌ మాత్రం అకాల వర్షాలకు సిద్ధవుతోంది.

New Update
Temperatures to rise gradually in North India from Friday, South braces for rain

Temperatures to rise gradually in North India from Friday, South braces for rain

దేశంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఫిబ్రవరి మూడోవారం ముగుస్తున్న నేపథ్యంలో ఉత్తర భారత్‌ క్రమంగా వేసవిలోకి అడుగులేస్తోంది. కానీ దక్షిణ భారత్‌ మాత్రం అకాల వర్షాలకు సిద్ధవుతోంది. భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం నుంచి దేశంలో ఉత్తర, దక్షిణ భారత్‌లో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొననున్నాయి. 

ఉత్తరాదిలో పెరగనున్న ఉష్ణోగ్రతలు

గత కొన్ని రోజులుగా ఉత్తరాదిలో పశ్చిమ విక్షోభాల ప్రభావంతో కురిసిన వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఢిల్లీ-NCR, రాజస్థాన్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో ఆకాశం నిర్మలంగా మారిపోయింది. పగటి ఉష్ణోగ్రతలు శుక్రవారం నుంచి క్రమంగా పెరగనున్నాయి. రానున్న వారం రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు హిమాలయాల్లో కూడా మార్పులు రానున్నాయి. పర్వత ప్రాంతాల్లో మంచు కరగడం ప్రారంభం అయ్యింది. దీంతో మైదాన ప్రాంతాల్లో వేడి గాలులు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 

Also Read: పురిటినొప్పులు భరించలేక.. పొత్తికడుపు కోసుకుంది.. చివరకు ఏమైందంటే?

దక్షిణాదికి వర్ష సూచన

ఇక దక్షిణ భారత్‌లో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, కేరళ, అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.  ఫిబ్రవరి 21, 22 తేదీలలో ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. తెలంగాణ, ఏపీలో కూడా దీని ప్రభావం పాక్షికంగా ఉండొచ్చని తెలిపింది.  ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించింది. 

ఇక ఉత్తరాదిలో ఉష్ణోగ్రతలు పెరగనున్న నేపథ్యంలో గోధుమ పంటలపై ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉందని వ్యవసాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట వేగంగా పక్వానికి వస్తే దిగుబడి తగ్గే  ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. రైతులు జాగ్రత్తుల తీసుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లోని రైతులు కూడా కోత దశలో ఉన్న పంటలను రక్షించుకోవాలని ఐఎంఐ సూచించింది. 

Also Read: షాకింగ్ ఘటన.. పెళ్లికి ఒకరోజు ముందు క్రిమినల్‌తో పారిపోయిన లేడీ కానిస్టేబుల్

Advertisment
తాజా కథనాలు