/rtv/media/media_files/2025/12/01/2025-most-significant-earthquakes-year-with-huge-loss-2025-12-01-15-04-25.jpg)
2025 most significant earthquakes Year with huge loss
2025 ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా అనేక భూకంపాలు(earthquakes), వరద(floods)లతో భారీ నష్టం సంభవించింది. జనవరి నుంచి డిసెంబర్ వరకు రిక్టర్ స్కేల్‌పై 4.0 కంటే ఎక్కువ తీవ్రతతో ఏకంగా 16,500లకు పైగా భూకంపాలు నమోదైనట్లు అంచనా ఉంది. ఇందులో డజనుకు పైగా 7.0 మ్యాగ్నిట్యూడ్‌ను దాటిపోయాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ ఏడాది అత్యంత ప్రాణాంతకమైన ప్రకృతి విపత్తుగా నిలిచింది. మార్చిలో మయన్మార్‌లో వచ్చిన భూకంపం ఏకంగా 5 వేల మందికి పైగా ప్రాణాలను బలితీసుకుంది.
ఈ ఏడాది జనవరిలో చైనా,టిబెట్ అటానమస్ రీజియన్‌లో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అదే నెలలో జపాన్‌లోని హోన్సు తీరంలో భూకంపం రావడంతో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఫిబ్రవరిలో నేపాల్‌లో 6.1 తీవ్రతతో రాగా.. భారత్‌లోని బీహార్, పాకిస్థాన్‌లో కూడా ప్రకంపనలు వచ్చాయి. ఇక మార్చిలో మయన్మార్‌లో వచ్చిన భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 7.7 తీవ్రతతో భూకంపం సంభవించగా దాదాపు 5,456 మంది ప్రాణాలు కోల్పోయారు. దీని ప్రభావంతో థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లోలో భారీ ప్రకంపనలు వచ్చాయి. పలు భవనాలు ఊగిపోయాయి. వీటికి సంబంధించిన వీడియోలు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read: విచ్చలవిడి శృంగారం..అడ్డు అదుపులేని లైంగిక సంబంధాలతో..ఎయిడ్స్ విజృంభన
2025 Most Significant Earthquakes Year
ఏప్రిల్‌లో ఫిలిప్ఫీన్స్‌లోని మస్‌బెట్ రీజియన్‌లో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించండంతో స్పల్ప సునామీ తరంగాలు నమోదయ్యాయి. మేలో గ్రీస్‌లోని ఏజియన్ సముద్రంలో, జూన్‌లో ఇండోనేషియాలోని హాల్మహేరాలో 6కు పాగా తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. జులై 29న రష్యాలో కమ్చట్కా తీరంలో 8.8 తీవ్రతతో శక్తిమంతమైన భూకంపం నమోదైంది. ఇది సముద్రంలో వచ్చినప్పటికీ పసిఫిక్ ప్రాంతమంతా సునామీ హెచ్చరికలకు దారి తీసింది. ఆగస్టులో చిలి, సెప్టెంబర్‌లో న్యూజిలాండ్‌లోని కెర్మాడెక్ దీవుల్లో భూకంపం రావడంతో కూడా సునామీ అలెర్ట్ జారీ చేశారు.
అక్టోబర్‌లో మెక్సికోలో 6.4 తీవ్రతతో భూకంపం వచ్చినప్పటికీ స్వల్ప నష్టం జరిగింది. నవంబర్‌లో అఫ్గానిస్థాన్‌లోని పశ్చిమ ప్రాంతంలో 6.3 తీవ్రతతో వచ్చిన భూకంపం భారీ ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగింది. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. రంగంలోకి దిగిన సహాయక బృందాలు భూకంప ప్రభావిత బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. డిసెంబర్‌లో కూడా పలు ప్రాంతాల్లో భూకంపాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం..RTC బస్సులు ఢీకొని 11 మంది మృతి
మరోవైపు ఈ ఏడాది వరదలు కూడా అనేక దేశాల్లో బీభత్సం సృష్టించాయి. చైనా, భారత్, జపాన్, ఫిలిప్ఫీన్స్, పాకిస్థాన్, శ్రీలంక, అమెరికా తదితర దేశాల్లో భారీగా వరదలు సంభవించాయి. తాజాగా శ్రీలంకలో వచ్చిన వరదల ప్రభావానికి ఏకంగా 355 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులు సంఖ్య రోజురోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకి భూకంపాలు, వరదలు పెరగడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పట్టణీకరణ వేగంగా జరుగుతున్న ప్రాంతాల్లో ఈ ముప్పు ఎక్కువగా ఉంది. రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలోని దేశాలతో పాటు.. టెక్టోనిక్ ప్లేట్లు కలుసుకునే భారత ఉపఖండంలో కూడా ఈ మధ్య భూకంపాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో భూకంపాలను తట్టుకునేలా నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉందని.. అలాగే విపత్తు నిర్వహణపై అవగాహన కల్పించాలని నిపుణులు సూచనలు చేస్తున్నారు.
Follow Us