🔴Live News Updates: యాదాద్రి జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
పాకిస్తాన్లో నేడు భారీ భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున 3:54 గంటలకు ప్రకంపనలు బీభత్సం సృష్టించాయి. ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైంది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిసింది.
ప్రేమికుల చిహ్నం తాజ్ మహల్ డేంజర్ జోన్ ఉంది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన తాజ్‌మహల్‌కు పగుళ్లు వస్తున్నాయి. వరల్డ్ టూరిస్ట్ ప్లేస్‌గా ఉన్న ఆగ్రాలోని తాజ్‌మహల్‌లో వర్షపు నీరు లీకవుతోంది.
అహ్మదాబాద్ విమానం కుప్పకూలిన దుర్ఘటనలో 275 మంది ప్రాణాలు కోల్పోవడం యావత్ ప్రపంచాన్ని కలచివేసింది. ఈ విషాద ఘటన నుంచి తేరుకోక ముందే 10 రోజుల్లోనే ఎయిరిండియా గ్రౌండ్ సేవల సిబ్బంది ఆఫీసులో పార్టీ చేసుకోవడం తీవ్ర విమర్శలకు కారణమైంది.
సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక మహిళ తన మూత్రంతో కళ్ళు శుభ్రం చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల కళ్ళు దురద, పొడిబారడం తగ్గుతుందని ఆ మహిళ పేర్కొంది. ఈ వీడియో వైరల్ గా మారడంతో వైద్యులు మండిపడుతున్నారు.
ఎయిర్ ఇండియాకు మరో బిగ్ షాక్ తగిలింది. ముంబై నుండి ఢిల్లీకి వస్తున్న విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ‘‘ఎయిర్ ఇండియా 2948@ టి3లో బాంబు ఉంది’’ అని టిష్యూ పేపర్‌పై రాసిన మెసేజ్ కనిపించడంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయింది.
ఓ నవ వధువు పెళ్లి మండపంలో హల్ చల్ చేసింది. అందంగా ముస్తాబైన పెళ్లి కూతురు తన స్నేహితులతో కలిసి చేసుకున్న పార్టీలో సిగరేట్, మందు తాగుతూ చిందులేసింది.
మరో విమాన ప్రమాదం తప్పింది. అమెరికా లాస్‌వేగాస్ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో టేకాఫ్ అయిన కొద్ది సేపటికే మంటలు చెలరేగాయి.
మహబూబాబాద్‌లోని ముకుందా థియేటర్ లో ప్రేక్షకులు కుబేరా సినిమా చూస్తుండగా ఒక్కసారిగా సీలింగ్ ఊడిపడింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో ప్రేక్షకులు థియేటర్ యాజమాన్యంపై గొడవకు దిగారు. యాజమాన్యం నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.