/rtv/media/media_files/2025/06/26/flight-2025-06-26-16-10-03.jpg)
మరో విమాన ప్రమాదం తప్పింది. అమెరికా లాస్‌వేగాస్ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో టేకాఫ్ అయిన కొద్ది సేపటికే మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని వెనక్కి మళ్లించి, సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులు, అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు.
Also Read : తెలంగాణ 3 రోజుల పాటు భారీ వర్షాలు
American Airlines Flight Engine Caught Fire
#BreakingNews :-
— HASSAN🔻𝕏 (@HassanSiddiqei) June 26, 2025
American Airlines Flight 1665 had to return to Las Vegas after its engine caught fire. This flight was going from Las Vegas in USA to North Carolina but it had to return within 10 minutes. There were 153 passengers on board this plane. It is being told that the… pic.twitter.com/EU9IQFdX4q
Also Read : వారికి గుడ్ న్యూస్..660 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు
ఈ మేరకు బుధవారం ఉదయం 8.11 గంటలకు లాస్‌వేగాస్‌లోని ఎయిర్‌పోర్టు నుంచి విమానం నార్త్ కరోలినాలోని ఛార్లొట్ ప్రాంతానికి బయల్దేరింది. టేకాఫ్ అయిన కాసేపట్లోనే గగనతలంలో ఉండగా విమానం ఇంజిన్ నుంచి పొగలు, మంటలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయంతో వణికిపోతుండగా వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఉదయం 8.20 గంటలకు విమానం తిరిగి లాస్‌వేగాస్ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా దిగింది.
ఇది కూడా చదవండి: గబ్బిలాల అద్భుత ప్రపంచం.. నిజాలు..అపోహలు
విమానంలో 153 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తుండగా వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ల్యాండ్ అయిన విమానాన్ని పరిశీలించగా ఇంజిన్ నుంచి మంటలు రాలేదని వెల్లడించారు.
Also Read : ఏడు రోజులు వరుసగా పచ్చి ఏలకులు తింటే ఏమవుతోందో తెలుసా?
latest-telugu-news | today-news-in-telugu | telugu viral news | international news in telugu