Batik Aircraft : ల్యాండ్ అవుతుండగా అటుఇటు ఊగిన విమానం.. తృటిలో తప్పిన ప్రమాదం (వీడియో)

ఇండోనేషియాలోని జకార్తా విమానాశ్రయంలో భారీ ప్రమాదం నుంచి ఓ విమానం తప్పించుకుంది. బోయింగ్ 737 విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో కొన్ని సెకన్ల పాటు కుడి వైపుకు వంగిపోయింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

New Update
Batik Air Boeing 737 Aircraft Nearly Tips Over for Few Seconds  in indonesia

Batik Air Boeing 737 Aircraft Nearly Tips Over for Few Seconds in indonesia

ఇటీవల గుజరాత్ జిల్లాలోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్-737 విమానం కూలిపోయి 275 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇండోనేషియాలో అలాంటిదే షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. టాంగెరాంగ్ ప్రావిన్స్‌లోని విమానాశ్రయంలో బాటిక్ ఎయిర్‌లైన్ విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో రన్‌వేపై కూలిపోకుండా తృటిలో తప్పించుకుంది. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: జూలై 1వ తేదీ నుంచి మారనున్న రూల్స్ ఇవే!

Boeing-737 Plane Landing Video

ప్రస్తుతం ఇండోనేషియాలో వాతావరణం అల్లకల్లోలంగా మారింది. విపరీతమైన వర్షాలు, ఈదురు గాలులతో ఇండోనేషియా దారుణంగా తయారైంది. ఈ నేపథ్యంలో టాంగెరాంగ్‌లోని సోకర్నో హట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో బాటిక్ ఎయిర్‌లైన్ బోయింగ్-737 విమానం భారీ ప్రమాదం నుంచి తప్పించుకుంది. 

Also Read: పేద ఖైదీలకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. బెయిల్‌కు ఆర్థిక సాయం

ఈదురుగాలులు, భారీ వర్షం పడుతుండగా.. బాటిక్ ఎయిర్‌లైన్ విమానాన్ని సోకర్నో హట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేస్తున్నపుడు అది రన్‌వేపై నియంత్రణ కోల్పోయింది. అటు ఇటు ఊగుతూ కనిపించింది. విమానం ఒక రెక్క దాదాపు రన్‌వేను ఢీకొట్టింది. 

Also Read: దుర్మార్గ తండ్రి.. నాలుగేళ్ల కూతురు చాక్లెట్ అడిగిందని.. దారుణంగా!

ఆ సమయంలో పైలట్ సమయస్ఫూర్తి ప్రదర్శించాడు. విమానాన్ని తన అనుభవంతో కంట్రోల్ చేసి.. చాలా మంది ప్రాణాలను కాపాడాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనంతరం ఇంజనీర్ల బృందం విమానాన్ని తనిఖీ చేసింది. కానీ విమానానికి ఎలాంటి నష్టం జరగలేదని తెలిసింది. 

Also Read :  ఈటల, రఘునందన్, అర్వింద్ ఎప్పటికీ బీజేపీ అధ్యక్షులు కాలేరు.. ఎందుకో తెలుసా?

 

Plane Crash | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | international news in telugu | gujarat | ahmedabad | breaking news in telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు