VIRAL VIDEO: షాకింగ్ వీడియో.. తన మూత్రంతో కళ్ళు కడుకున్న మహిళ - దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!

సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక మహిళ తన మూత్రంతో కళ్ళు శుభ్రం చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల కళ్ళు దురద, పొడిబారడం తగ్గుతుందని ఆ మహిళ పేర్కొంది. ఈ వీడియో వైరల్ గా మారడంతో వైద్యులు మండిపడుతున్నారు.

New Update
pune woman urine eye wash video viral on social media

pune woman urine eye wash video viral on social media

తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక మహిళ తన మూత్రంతో కళ్ళు శుభ్రం చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల కళ్ళు దురద, పొడిబారడం తగ్గుతుందని ఆ మహిళ పేర్కొంది. ఈ వీడియో వైరల్ గా మారడంతో వైద్యులు మండిపడుతున్నారు. ఇలా చేయడం ప్రమాదకరమని అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

పూణేకు చెందిన నూపూర్ పిట్టి అనే మహిళ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె ఆరోగ్యానికి సంబంధించిన వీడియోలు చేస్తూ ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. ఈ క్రమంలో ఆమె తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో చేసింది. ‘యూరిన్ ఐ వాష్’ - నేచర్స్ ఓన్ మెడిసిన్ అనే వీడియోను పోస్ట్ చేసింది. ఇది కొద్దిసేపటికే వైరల్ అయింది. 24 గంటల్లో ఈ వీడియోకు 1.5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

వీడియోలో ఆ మహిళ ఏమి చెప్పింది?

నుపుర్ పిట్టి.. ఆ వీడియోలో ఉదయం తాజా మూత్రంతో తన కళ్ళను కడుక్కుంటున్నానని తెలిపింది. ఇది మాత్రమే కాకుండా ఆమె కళ్ళు ఎలా కడుక్కోవాలో కూడా చూపించింది. ప్రత్యామ్నాయ నివారణగా దీనిని ఉపయోగించమని ఆమె చెప్పినప్పటికీ.. వైద్యులు దానిపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. అలా చేయడం చాలా ప్రమాదకరమని తెలిపారు. 

వైద్యులు ఏమంటున్నారంటే?

ఈ వీడియోపై వైద్యులు మండిపడుతున్నారు. హెపటాలజిస్ట్ డాక్టర్ సిరియాక్ ఎబి ఫిలిప్స్ ఈ వీడియోను ట్విట్టర్‌లో తిరిగి పోస్ట్ చేసి.. ఇలా చేయవద్దని ప్రజలను కోరారు. ‘‘దయచేసి మీ కళ్ళలో మూత్రం పెట్టుకోకండి. మూత్రం స్టెరైల్ కాదు.’’ అని తెలిపారు.  చాలా మంది ఇన్‌స్టాగ్రామ్ నెటిజన్లు ఆ మహిళ వీడియోపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘మూత్రం శరీరం నుండి వచ్చే వ్యర్థం. ఇందులో బ్యాక్టీరియా ఉండవచ్చు. అలాంటి పరిస్థితిలో మీరు మీ కళ్ళను శుభ్రం చేసుకుంటున్నారు.’’ అని మండిపడుతున్నారు.

Advertisment
తాజా కథనాలు