Double Murder Case: జనగామ జిల్లాలో డబుల్ మర్డర్ కలకలం
తెలంగాణలోని జనగామ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు మహిళలను గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి తలలు పగల గొట్టి హత్య చేశారు. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం తమ్మడపల్లి(ఐ) గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లు దారుణ హత్యకు గురయ్యారు.