BIG BREAKING: కొత్త పార్టీ ప్రకటనపై కవిత క్లారిటీ.. ఎలా ఉంటుందో చెప్పిన కవిత!

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత రాజకీయ పార్టీ స్థాపనపై క్లారిటీ ఇచ్చారు. కొత్త పార్టీ ఎప్పుడు ప్రకటిస్తున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ ఇలా అన్నారు. తాను ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కవిత స్పష్టం చేశారు.

New Update
Kavitha

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత రాజకీయ పార్టీ స్థాపనపై క్లారిటీ ఇచ్చారు. కొత్త పార్టీ ఎప్పుడు ప్రకటిస్తున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ ఇలా అన్నారు. తాను ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కవిత స్పష్టం చేశారు. అయితే, మహిళల నుంచి కొత్త పార్టీ పెట్టాలనే డిమాండ్ బలంగా ఉందని కల్వకుంట్ల కవిత తెలిపారు. పార్టీ పెట్టడం పెద్ద విషయం కాదని, ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగానే ఆ కొత్త పార్టీ ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. 

దీంతో ఆమె త్వరలో కొత్త పార్టీ ప్రకటించనున్నట్లు చర్చలు జరుతుగున్నాయి. బీఆర్ఎస్‌ పార్టీతో విభేదాల కారణంగా ఆమెని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి ఆమె తెలంగాణ జాగృతి తరపునే కార్యక్రమాలు విస్తృతం చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో జాగృతి జనం బాట అనే కార్యక్రమంతో ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతున్నారు. గత ప్రభుత్వాల పని తీరును ప్రశ్నిస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు