/rtv/media/media_files/2025/11/27/telangana-election-commission-launches-grievance-portal-for-local-polls-2025-11-27-20-00-48.jpg)
Telangana Election Commission launches grievance portal for local polls
తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. గురువారం మొదటి దశ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎన్నికల సంఘం(election-commission) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రక్రియను మరింత సజావుగా నిర్వహించేందుకు టీ పోల్ మొబైల్ అనే యాప్(T-Poll Mobile App)ను ప్రారంభించింది. దీనిద్వారా ఓటర్ల పోలింగ్ స్టేషన్ వివరాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే అందులో ఈసీకి ఫిర్యాదు చేయొచ్చు. అలాగే స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు.
Also Read: నన్ను గెలిపిస్తే ఎకరం పొలం, ఇంటింటికీ మినరల్ వాటర్.. సర్పంచా.. మజాకా
Telangana EC Launches Grievance Portal
దీనివల్ల ఓటర్లు తమ ఓటరు స్లిప్, పోలింగ్ స్టేషన్ వివరాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ఫిర్యాదులు కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చని ఈసీ ప్రకటనలో తెలిపింది. ఈ యాప్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉందని పేర్కొంది. ఇదిలాఉండగా డిసెంబర్ 11,14,17 తేదీల్లో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
Also read: పొలంలో రూ.500 నోట్లు నాటిన రైతు.. ఎందుకిలా చేశాడంటే ?
Follow Us