Telangana: నన్ను గెలిపిస్తే ఎకరం పొలం, ఇంటింటికీ మినరల్ వాటర్.. సర్పంచా.. మజాకా

తెలంగాణలో సర్పంచ్‌ ఎన్నికల జాతర మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి తొలివిడత నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఖమ్మం జిల్లాకి చెందిన సర్పంచ్‌గా పోటీ చేస్తున్నాడు. ఈయన ప్రకటించిన మేనిఫెస్టో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

New Update
sarpunch contestant announced attracting manifesto in khammam

sarpunch contestant announced attracting manifesto in khammam

తెలంగాణ(telangana)లో సర్పంచ్‌ ఎన్నిక(Sarpunch Elections 2025)ల జాతర మొదలైంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి తొలివిడత నామినేషన్లు స్వీకరిస్తున్నారు. దీంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. సర్పంచ్‌గా పోటీచేసే వాళ్లు తమ మేనిఫెస్టోలు ప్రకటిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. అయితే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మూఠాపురం గ్రామం నుంచి రావెళ్ల కృష్ణరావ్‌ అనే వ్యక్తి సర్పంచ్‌గా పోటీ చేస్తున్నాడు. ఈయన ప్రకటించిన మేనిఫెస్టో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తనను గెలిపిస్తే ఎకరం భూమి, ఇంటిపన్ను, నీటిపన్ను చెల్లిస్తానంటూ వరాల జల్లులు కురించాడు. - local-body-elections

Also Read :  సర్పంచ్‌ ఎన్నికలపై స్టే.. హైకోర్టు సంచలన తీర్పు

రావెళ్ల కృష్ణారవ్‌ మేనిఫెస్టోలోని హామీలు ఇవే 

1. గ్రామంలోని వీరన్న స్వామి ఆలయం కోసం 1 ఎకరం భూమి విరాళంగా ఇస్తాను
2. నేను అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు అందరి ఇంటి పన్ను చెల్లిస్తాను
3. ఐదేళ్లు నేనే నల్లా బిల్లులు కడుతాను
4. గ్రామంలో ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు ఉచిత మందులు పంపిణీ
5. గ్రామంలో ఉన్న ప్రతి దేవాలయానికి ఉత్సవాల కోసం రూ.50,000 ఆర్థిక సాయం
6. వినాయక చవితి సందర్భంగా అన్ని ఉత్సవ కమిటీలకు విగ్రహాలు ఉచితం
7. గ్రామంలోని మసీదు, చర్చిలకు కూడా ప్రార్థనల కోసం ఏటా రూ.50,000 
8. ప్రభుత్వ పాఠశాలల్లో ఆగస్టు 15, జనవరి 26 కార్యక్రమాల కోసం విద్యార్థులకు బహుమతులు
9. బాగా చదివే విద్యార్థులకు ప్రతి తరగతి నుంచి ఇద్దరికి ప్రతి సంవత్సరం రూ.2,000 స్కాలర్‌షిప్
10. ఇతర గ్రామాల్లోకి వెళ్లి చదువుకునే 10 మంది విద్యార్థులకు ప్రతి సంవత్సరం సైకిళ్లు ఉచితం.
11. సంక్రాంతి పండుగకు మగ్గుల పోటీ బహుమతులకు రూ.5,000.
12. అయ్యప్ప మాలధారులకు నిత్య అన్నదానం
13. దసరా సందర్భంగా 100 మంది పేదలకు బట్టల పంపిణీ
14. ఎంపిక చేసిన 10 మంది పేద మహిళలకు కుట్టు మిషన్లు ఉచితం
15. గ్రామంలో సొంత ఖర్చులతో గ్రంథాలయం ఏర్పాటు
16. వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఇంటింటికి ఉచితంగా మినరల్ వాటర్ సరఫరా
17. పెళ్లిళ్లు, జాతరలకు డీజే, మైక్ ఉచితం.
18. మరణించిన వారికి శవ భద్రపరిచేందుకు ఫ్రీజర్ ఉచితం
19. స్మశానానికి వైకుంఠ రథం ఏర్పాటు
20. పేద కుటుంబాల్లో ఆడపిల్ల వివాహానికి చీర–సారే కానుక
21. వికలాంగులకు ఉచిత ట్రైసైకిళ్లు

Also Read :  మోగిన నగారా..గ్రామాల్లో పంచాయతీ వార్‌

Advertisment
తాజా కథనాలు