/rtv/media/media_files/2025/11/27/elections-2025-11-27-08-39-04.jpg)
తెలంగాణ పల్లెల్లో ఎన్నికల హడావుడి మొదలవుతోంది. మొదటి దశలో 189 మండలాల్లోని 4,236 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఈరోజు కలెక్టర్లు ఎన్నికల నోటిఫికేషన్లు జారీ చేస్తారు. వెంటనే నామినేషన్ల స్వీకరణ కూడా మొదలవుతుంది. 29 వరకు అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. 30న పరిశీలన చేపడతారు. వీటిపై డిసెంబరు 1న వినతులు స్వీకరిస్తారు.. 2న పరిష్కారం చేస్తారు. మూడో తేదీ నామినేషన్ల ఉపసంహరణకు గడువు కాగా అదే రోజు అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. 11న పంచాయితీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. అదే రోజున ఫలితాలు కూడా వెల్లడిస్తారు. ఉప సర్పంచి ఎన్నికలను కూడా నిర్వహిస్తారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు మొత్తం సన్నాహాలు పూర్తి చేసింది.
మొదటి దశ ఎన్నికల సన్నద్ధతపై నిన్న అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, సీనియర్ అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాంతి భద్రతల పర్యవేక్షణ, పోలింగ్ సిబ్బంది నియామకం, పోలింగ్ సిబ్బందికి శిక్షణ తదితర అంశాలపై ఆదేశాలు జారీ చేశారు.
నామినేషన్ వేసే ముందు చూసుకోవాల్సినవి..
నామినేషన్ వేసే ముందు అభ్యర్థులు చూసుకోవాల్సిన దానిపై ఎన్నికల కమిషన్ వివరాలు విడుదల చేసింది. నామినేషన్ అభ్యర్థికి కనీసం 21 ఏళ్ళు నిండి ఉండాలి. ఓటరుగా నమోదై ఉండాలి. SC/ST/BC వారైతే castecertificateజత పరచాలి. అలాగే డిపాజిట్ డబ్బులను ముందుగానే కట్టేయాలి. వీటిలో పాటూ ఈ కింది కచ్చితంగా చూసుకోవాలని చెప్పింది.
1.నేరచరిత్ర,చర, స్తిర ఆస్తులు, విద్యార్హత లతో కూడిన అఫిడవిటీ ఇద్దరు సాక్ష్యాలతో సంతకం పెట్టించి ఇవ్వాలి.
2. ఎలక్షన్ expendituremaintainచేస్తానని declarationఇవ్వాలి.
3. ఏదైతే స్థానం నుంచి పోటిచేస్తున్నారో ఆ స్థానం నుంచి ఓటరు మాత్రమే ప్రతిపాదకుడుగా ఉండాలి.
4. నామినేషన్ పత్రం లో:
A)PART1 లొ ప్రతిపాదకుని సంతకం ఉండాలి
B)PART 2 లో అభ్యర్ధి సంతకం ఉండాలి.
C)PART 3 లొ కూడా అభ్యర్ధి సంతకం ఉండాలి.
D)PART 4 లో RO సంతకం ఉండాలి
E)PART 5(Rejectednominationsreasons)లొ RO సంతకం ఉండాలి.
F)PART 6 (receipt ) లొ RO సంతకం ఉండాలి.
5. అఫిడవిటీ లో ఇద్దరు సాక్షుల సంతకం మరియు అభ్యర్థి సంతకం ఉండాలీ.
6. Expendituredeclarationలో అభ్యర్ధి సంతకం ఉండాలి.
వీటితో పాటూ నామినేషన్ పత్రం తో జత పరచవలసినవి..
1)ఫామ్ -3
2) స్వీయ ప్రకటన (అఫిడవిట్)
3)అనుబంధం5
4) డిపాజిట్ (
5)Noduecertificatefrom GP
6)Bankఖాతా Xerox
7) ఆధార్ కార్డు.
8)castecertifcte
Follow Us