High Court: సర్పంచ్ ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్

స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలపై బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సర్పంచ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌ తక్కువగా ఉందని రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ సర్పంచ్ హైకోర్టును ఆశ్రయించారు.

New Update
BREAKING

BREAKING

స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలపై బుధవారం హైకోర్టు(high-court)లో పిటిషన్ దాఖలైంది. సర్పంచ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌ తక్కువగా ఉందని రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ సర్పంచ్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం ఇచ్చిన రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు 17 శాతం గ్రామపంచాయతీలు మించడంలేదని, అది జీవో 46 కు విరుద్ధమని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ సర్పంచ్ ఆగమయ్య తరుపు న్యాయవాది పిటిషన్ దాఖలైంది. - big twist in sarpanch elections

Also Read :  ఐబొమ్మ రవి కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. పైరసీ చేయలేదు సినిమాలు కొన్నాడు

Gram Panchayat Elections 2025

సంగారెడ్డి జిల్లాలో 613 గ్రామ పంచాయతీలు ఉండగా, కేవలం 117 స్థానాలను మాత్రమే బీసీలకు కేటాయించారని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. పిటిషనర్ తరపు వాదనలు విని హైకోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది. ఇప్పటికే పలు కారణాల వల్ల వాయిదా పడిన లోకల్ బాడీ ఎలక్షన్.. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈక్రమంలో రిజర్వేషన్లు కూడా ఖరారు చేసింది. పాత రిజర్వేషన్ల ప్రకారం రాష్ట్రంలో 12వేలకు పైగా గ్రామ పంచాయతీల్లో 2వేలు మాత్రమే బీసీలు పోటీ చేసే విధంగా రిజర్వేషన్లు వచ్చాయి. దీంతో పలు బీసీ నాయకులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. - local body elections in telangana

Also Read :  మోగిన నగారా..గ్రామాల్లో పంచాయతీ వార్‌

Advertisment
తాజా కథనాలు