/rtv/media/media_files/2025/06/25/telangana-local-elections-2025-06-25-12-57-03.jpg)
Panchayat elections
Panchayat elections : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. పలు ఆసక్తికర పరిణామాల నడుమ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే రాష్ట్రంలో ఓ మాట ప్రతీచోటా వినిపిస్తోంది. అదే 'ఏకగ్రీవం'. గతంలోనూ ఈ సంస్కృతి ఉంది. కానీ ప్రస్తుతం మన రాష్ట్రంలో దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రధానంగా ప్రభుత్వం ఏకగ్రీవాల వైపు మొగ్గుచూపుతూ... ప్రోత్సాహకాలను ప్రకటించింది. అసలు ఏకగ్రీవాలు ఎక్కడ మొదలయ్యాయి..? ఇప్పుడు ఏయే రాష్ట్రాల్లో వీటిని ప్రోత్సహిస్తున్నారో ఓసారి చూద్దాం.
Also Read: అఖండ 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్ట్ గా రేవంత్ రెడ్డి..?
ఎప్పుడు మొదలైందంటే?
ఏకగ్రీవం.. ఇప్పుడు మన రాష్ట్రంలోని ప్రతి పల్లెల్లో వినిపిస్తున్న పదం. అసలు ఏకగ్రీవం ఎందుకు చేయాలి.. చేస్తే లాభం ఏంటీ..? అని అందరికీ అనుమానం రావడం సర్వసాధారణం. ఒకవేళ ఏకగ్రీవం చేస్తే ప్రభుత్వాలు చెప్పినట్టు నిజంగానే నజరానా ఇస్తాయా..? ఒక వేళ చెప్పినట్టు రాకపోతే ఏం చేయాలి..? వస్తే ఆ నిధులను దేనికి ఉపయోగించాలి..? అనే ప్రశ్నలు అందరి మదిని తొలుస్తున్నాయి. ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు ప్రోత్సాహక నిధులు కేటాయించే కార్యక్రమం మొట్టమొదటి సారి 1960లో రాజస్థాన్ రాష్ట్రం ప్రారంభించింది. ఆ తర్వాత పలు రాష్ట్రాలు దీనిని అమలు చేశాయి. ప్రస్తుతం తెలంగాణ, హరియాణ, గుజరాత్ రాష్ట్రాల్లో దీన్ని అమలు చేస్తున్నారు.
Also Read: NBK 111 క్రేజీ అప్‌డేట్.. మరోసారి డ్యూయల్ రోల్‌లో బాలయ్య నట విశ్వరూపం..!
ఎంత జనాభా ఉంటే.. ఎంత ప్రోత్సాహకం..?
రెండు వేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగితే ఆ పంచాయతీకి రూ.5 లక్షల వరకు నగదు ప్రోత్సాహం అందిస్తారు. గతంలో 2 వేలలోపు జనాభా ఉన్న పంచాయతీలను ప్రత్యేకంగా విభజించలేదు. ఇక 2001 నుంచి 5000 లోపు జనాభా ఉండే పంచాయతీలకు ఏకగ్రీవ ఎన్నికలు జరిగిన పక్షంలో రూ.10 లక్షల వరకు నగదు ప్రోత్సాహం అందిస్తారు. 5001 నుంచి 10 వేల జనాభా ఉన్న పంచాయతీలకు ఏకగ్రీవం అయితే రూ.15 లక్షల వరకు నగదు ప్రోత్సాహం ఇస్తారు. పదివేల కన్నా అధికంగా ఉన్న పంచాయతీలకు రూ.20 లక్షల నగదు ప్రోత్సాహం అందిస్తారని తెలుస్తోంది.
ఏకగ్రీవాలతో ఏంటి ఉపయోగం..?
అయితే ఎకగ్రీవంగా ఎన్నుకుంటే కలిగే ఉపయోగాలు ఏంటనే ప్రశ్న అందరిలోనూ ఉత్పన్నమవడం కామన్. ప్రభుత్వం ఇచ్చే ఈ ఒక్క నజరానే కాకుండా అనేక ప్లస్​ పాయింట్లు ఏకగ్రీవాల ద్వారా పొందవచ్చు. ప్రధానంగా గ్రామంలో ప్రచార హోరు ఉండదు. నగదు, మద్యం పంపిణీ ఉండదు. ఎన్నికల నిర్వహణ ఖర్చు ఉండదు. గుమిగూడే అవసరం ఉండదు. ఏకగ్రీవాల ద్వారా వచ్చిన నిధులపై గ్రామ పౌరులందరికీ సమాచారం ఉంటుంది. వాటి ఖర్చుపై చర్చించి పనులు చేస్తారు. అవినీతి తక్కువ జరిగే ఆస్కారం ఉంటుంది.
Also Read: టాలీవుడ్‌లో మళ్లీ బిజీ అవుతోన్నరేణు దేశాయ్..? లేటెస్ట్ అప్‌డేట్ ఇదే!
సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే.. రూ.10 లక్షలు
గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరచిన అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే ప్రత్యేకంగా రూ. 10 లక్షలు ఇస్తానని ఆయన ప్రకటించారు. కరీంనగర్ ఎంపీ సీటు పరిధిలోని గ్రామాలకు దీన్ని అందజేస్తానని తెలిపారు. ఈ మేరకు మాట్లాడుతూ.." ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 5 లక్షలు ఇస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం మాటతప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర నయా పైసా నిధులు లేవు. నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. ఈ ఎన్నికలు కేంద్ర నిధుల కోసమే. ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి" అని బండి సంజయ్ స్పష్టం చేశారు.
Follow Us