నా మాటలు సీరియస్‌గా తీసుకోవద్దు.. వారిపై గౌరవం ఉంది: కొండా మురళి!
కాంగ్రెస్ నేతలంటే తనకు గౌరవం ఉందని, తాను చేసిన వ్యాఖ్యలను కొందరు నేతలు సీరియస్‌గా తీసుకోవద్దని కొండా మురళి కోరారు. తాను బలవంతుడినో, బలహీనుడినో అందరికీ తెలుసన్నారు.
కాంగ్రెస్ నేతలంటే తనకు గౌరవం ఉందని, తాను చేసిన వ్యాఖ్యలను కొందరు నేతలు సీరియస్‌గా తీసుకోవద్దని కొండా మురళి కోరారు. తాను బలవంతుడినో, బలహీనుడినో అందరికీ తెలుసన్నారు.
కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నవిభేదాలను పరిష్కరంచడానికి పార్టీ క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగింది. వరంగల్ జిల్లా మంత్రి కొండా సురేఖ, కొండా మురళికి, ఆ జిల్లా ఎమ్మెల్యేలకు మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఈ రోజు మురళి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుకానున్నారు.
వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కుమారుడే కన్నతల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన వినోద కు ఆమె కొడుకు సతీష్‌తో ఆస్తి గొడవుల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అక్రమ సంబంధం నేపథ్యంలో ఒక మహిళను వివస్త్రను చేసి అత్యంత క్రూరంగా దాడి చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయంశంగా మారింది.
తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం.. తెలంగాణలో ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్లలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
మంత్రి కొండా సురేఖ, మురళిల తీరుపై వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బగ్గుమంటున్నారు. కొండా సురేఖ దంపతులపై పీసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. నోరు అదుపులో పెట్టుకోవాలంటూ కొండా దంపతులకు వార్నింగ్ ఇస్తున్నారు.
ఒక్క టూవీలర్‌పై వందల్లో చలాన్లు దర్శనమివ్వడంతో తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు ఖంగుతిన్నారు. హనుమకొండ జిల్లా కాజీపేట చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేశారు. అటువైపుగా వచ్చిన ఓ స్కూటీని ఆపి పెండింగ్ చలాన్లను చెక్ చేయగా 233 చలాన్లు ఉండటంతో షాకయ్యారు.
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కోర్టు భారీ ఊరటనిచ్చింది. క్వారీ యజమానిని బెదిరించి రూ.50 లక్షలు డిమాండ్ చేసిన కేసులో అరెస్ట్ అయిన ఆయనకు ఖాజీపేట రైల్వేకోర్టు మొదట 14 రోజలు రిమాండ్ విధించింది. ఆ తర్వాత షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.