Telangana: తెలంగాణలో గుండెపగిలే విషాదం.. తరగతులు అర్థం కావడం లేదని బాలిక సూసైడ్!

మంచిర్యాల జిల్లాకు చెందిన ఒక ఇంటర్‌ విద్యార్థిని హనుమకొండ నయీంనగర్‌లోని ఒక ప్రైవేటు కళాశాలలో బలవన్మరణం చేసుకుంది. తన చదువులో వెనుకబడిపోయానని, తరగతులు అర్థం కావడం లేదని ఆందోళన చెందుతూ ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

New Update
Mancherial Inter student suicide

Mancherial Inter student suicide

ఇటీవల కాలంలో కళాశాల విద్యార్థుల ఆత్మహత్యలు పెరగడం ఒక తీవ్రమైన సమస్యగా మారింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. విద్యార్థులపై ఒత్తిడి పెరిగిపోవడమే ప్రధాన కారణం అని తెలుస్తోంది. మంచి మార్కులు సాధించాలనే ఒత్తిడి, పోటీ పరీక్షల భారం, పాఠ్యాంశాలను అర్థం చేసుకోలేకపోవడం వంటివి విద్యార్థులను మానసికంగా కుంగదీయడంతో వారు ఆత్మవిశ్వాసం కోల్పోయి సూసైడ్‌ చేసుకునే వరకు వెళ్తున్నారు.

మరీ ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి అధిక అంచనాలు పెట్టుకోవడం కూడా ఒక ప్రధాన కారణం అని తెలుస్తోంది. తమ పిల్లలు డాక్టర్లు లేదా ఇంజనీర్లు కావాలని బలవంతం చేయడం, ఇతరులతో పోల్చడం వంటివి విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తాజాగా అలాంటి ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓ విద్యార్థిని ఏకంగా కాలేజీలోనే సూసైడ్ చేసుకున్న ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

క్లాస్‌లు అర్థం కావడం లేదని సూసైడ్

మంచిర్యాల జిల్లాకు చెందిన ఒక ఇంటర్‌ విద్యార్థిని(16) హనుమకొండ నయీంనగర్‌లోని ఒక ప్రైవేటు కళాశాలలో బలవన్మరణం చేసుకుంది. ఆదివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. క్లాస్ రూమ్‌లో ఆమె రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆమె తన చదువులో వెనుకబడిపోయానని, తరగతులు అర్థం కావడం లేదని ఆందోళన చెందుతూ ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు రాసి ఉందని పోలీసులు తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం.. విద్యార్థిని ఉదయం తన గదిలో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. తోటి విద్యార్థినులు వచ్చి చూసేసరికి ఆమె అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం హాస్పిటల్‌కు తరలించారు. విద్యార్థిని గదిలో లభించిన సూసైడ్ నోట్‌లో.. ‘‘నాకు క్లాసులు అర్థం కావడం లేదు. చదువులో వెనుకబడిపోతున్నాను’’ అని పేర్కొందని పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటనతో తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. హనుమకొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటనపై విద్యా సంస్థలు, తల్లిదండ్రులు, విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఉండడానికి తగిన మానసిక మద్దతు ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

హైదరాబాద్‌లో మరో ఘోరం

ఇదిలా ఉంటే హైదరాబాద్ ఉప్పల్‌లోని వెంకటరెడ్డి నగర్‌లో దారుణం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్న నాగరాజు అనే వ్యక్తి వేరొక మహిళ మోజులో పడి కట్టుకున్న భార్య లావణ్యను, కన్న పిల్లలను రోడ్డున పడేశాడు. వీరికి 2009లో మ్యారేజ్ జరిగింది. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. అయితే నాగరాజు గతకొన్ని రోజుల క్రితం నుంచి వేరొక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. 

ఈ విషయం అతడి భార్య లావణ్యకు తెలియడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే నాగరాజు దారుణానికి పాల్పడ్డాడు. ప్రియురాలి మోజులో పడి.. భార్యను, ఇద్దరు పిల్లల్ని ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో వారు మండుటెండలో దిక్కుతోచని స్థితిలో రోడ్డున పడ్డారు. తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని ఆ మహిళ వేడుకుంటూ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. 

Advertisment
తాజా కథనాలు