Weather Update: రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు!

బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల మరో ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

New Update
Rains

Rains

బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల మరో ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్ప పీడనం ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్రలో ఆగస్టు 4, 5 తేదీల్లో రాయలసీమలో ఆగస్టు 3 నుంచి 6 వరకు భారీ వర్షాలు పడతాయి. అలాగే లక్షద్వీప్, కర్ణాటక, కేరళ, యానాంలో కూడా వచ్చే 7 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. 

ఇది కూడా చూడండి: Kaleshwaram Project : తెలంగాణలో మరో సంచలనం... సీఎం రేవంత్ రెడ్డి చేతికి కాళేశ్వరం నివేదిక...

తేలికపాటి నుంచి మోస్తరు..

నేడు ఏపీ, తెలంగాణలో పగలు ఎండ, మేఘాల వాతావరణం ఉంటుంది. రాత్రిపూట ఒక్కసారిగా వాతావరణం మారి తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, యాదగిరిగుట్ట, సిరిసిల్ల, నిజమాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఏపీలో ఉష్ణోగ్రతల్లో మార్పులు
ఏపీలో కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవడంతో పాటు మరి కొన్నిసార్లు ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయి. ఉదయం పూట ఎండ ఎక్కువగా ఉంటుంది. వేసవి సమయంలో ఎలాంటి ఎండ ఉంటుందో అలానే ఈ సీజన్‌లో ఉంటుంది. ఉదయం ఉక్కపోతగా ఉంటుంది. చివరికి సాయంత్రం వస్తే తేమ పెరుగుతుంది. ఒక్కసారిగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, చిత్తూరు, ఒంగోలులో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

అప్రమత్తంగా ఉండాలని..
ఈ వర్షాలకు ప్రజలు బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని తెలిపారు. ముఖ్యంగా వేటకు వేళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వారు అయితే తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. కావాల్సిన వాటిని ముందుగానే ఇంటికి తీసుకుని వచ్చి పెట్టుకోవాలి. వర్షాల సమయంలో మిగతా వారితో పోలిస్తే లోతట్టు ప్రాంతాల ప్రజలు తొందరగా మునిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.

ఇది కూడా చూడండి: Ropeways In Hyderabad : హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలకు చెక్..ఇక గాలిలో తేలిపోవాల్సిందే...

ap weather update today | ap weather updates | ap today weather update | Weather Update | latest-telugu-news | telugu-news | latest telangana news | andhra-pradesh-news

Advertisment
తాజా కథనాలు