/rtv/media/media_files/2025/08/01/couple-protest-with-buffaloes-at-bhupalapally-mla-office-2025-08-01-16-06-47.jpg)
Couple Protest with Buffaloes at Bhupalapally MLA Office
తెలంగాణలోని భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణకు ఓ రైతు బిగ్ షాక్ ఇచ్చాడు. ఓ పాడి రైతు తన బర్లకోసం నిర్మించుకున్న షెడ్డూను ఎమ్మెల్యేతో పాటు అతని అనుచరుల ఒత్తిడితో కూల్చివేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతు తనబర్లను తీసుకువచ్చి క్యాంపు ఆఫీసులోకి పంపి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాడు. ఒక సామాన్య రైతు ఏకంగా ఒక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి బర్లను పంపడంతో స్థానికంగా సంచలనం సృష్టించింది. వివరాల ప్రకారం....
ఇది కూడా చూడండి: తెలంగాణ మహిళలకు బంపరాఫర్.. ఉచిత బస్సు ట్రైనింగ్
Couple Protest With Buffaloes
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన పాడిరైతు కురాకుల ఓదెలు తన బర్రెల కోసం కష్టపడి తన ఇంటికి సమీపంలో ఒక షెడ్డూను నిర్మించుకున్నాడు. అయితే కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు దీనిపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడంతో ఆయన ఆదేశాల మేరకు అధికారులు దాన్ని కూల్చివేసినట్లు ఓదెలు, లలిత దంపతులు చెబుతున్నారు. తన బర్రెల షేడ్‌ను కూలగొట్టారని ఆవేదన వ్యక్తం చేస్తూ..తన బర్లను తీసుకుని ఏకంగా జిల్లా కేంద్రంలోని క్యాంపు ఆఫీసుకు వచ్చాడు. తనభార్య లలితతో కలిసి వచ్చిన రైతు వాటిని క్యాంపు అఫీసులోకి పంపించాడు. ఒక్కసారిగా క్యాంప్ ఆఫీసులోకి గేదెలు రావడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.
దీంతో క్యాంపు కార్యాలయంలో ఉన్న నేతలు, కార్యకర్తలు, ప్రజలు గందరగోళానికి గురయ్యారు.వెంటనే స్పందించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,పోలీసులు బర్లను బయటకు పంపించేశారు. అయితే ఎమ్మెల్యే నిర్ణయంతో తీవ్రంగా నష్టపోయానని ఓదెలు తనకు న్యాయం చేయాలంటూ కుటుంబ సమేతంగా నిరసనకు దిగారు. ఎమ్మెల్యే చెప్పాడనే అధికారులు మా షెడ్డును కూల్చేశారని దంపుతుల ఆరోపించారు. షెడ్డు లేకుండా బర్రెలు ఎక్కడ ఉండాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఓటు వేస్తే మాకు ఇచ్చే బహుమతి ఇదేనా అంటూ ఆ దంపతులు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. కూల్చేసిన షెడ్డు నిర్మించే వరకు బర్లను తీసుకెళ్లేది లేదంటూ వారు అక్కడే బైటాయించారు.
Also Read : సైబర్ మోసాలపై అప్రమత్తత.. హైదరాబాద్‌లో తగ్గుతున్న కేసులు, కొత్త ట్రెండ్‌లు!
క్యాంపు కార్యాలయంలోనే తనకు న్యాయం చేయాలంటూ ఓదెలు కుటుంబ సమేతంగా నిరసనకు దిగారు. తనకున్న ఒక్కగానొక్క షెడ్డును కూల్చేశారు. నా బర్రెలను ఎక్కడ కట్టేసుకోవాలి. ఎమ్మెల్యే ఈ అంశంపై స్పందించాలని డిమాండ్ చేశారు. నాకు న్యాయం జరిగేంతవరకు ఇక్కడినుంచి కదలను” అంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.వెంట తెచ్చుకున్న పురుగుమందుతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేసి అధికారుల తప్పు ఉంటే చర్యలు తీసుకుంటామని స్థానిక సీఐ నరేష్ కుమార్ హామీ ఇచ్చారు. అయితే ఎమ్మెల్యే అధికారిక నివాసంలోకి పశువులను పంపిన ఓదెలును ఆయన భార్యను పోలీసులు స్టేషన్‌కు తరలించారు.
ఈ విషయమై అధికారులు స్పందిస్తూ సింగరేణి ఏరియాకు చెందిన కూరాకుల ఓదేలు, లలిత దంపతులు కొన్నేళ్ల క్రితం గేదెల కోసం ఇంటి ముందు రేకుల షెడ్డు నిర్మించారన్నారు. ఇటీవల జాతీయ రహదారి నుంచి సింగరేణి ప్రహరీ వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని వారు తెలిపారు. దీంతో షెడ్డు వేసుకున్న భూమికి సంబంధించిన పత్రాలు చూపించాలని నెల క్రితమే ఓదేలుకు నోటీసులు ఇచ్చామని మున్సిపల్ అధికారులు అంటున్నారు. అయినా ఓదెలు ఎటువంటి పత్రాలు చూపించకపోవడతో పోలీసుల సమక్షంలోనే షెడ్డును కూల్చివేశామని మున్సిపల్ అధికారులు తెలిపారు. కాగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి గేదేలను పంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై స్థానికులు, ప్రతిపక్షాలు సెటర్లు వేస్తున్నారు.
MLA camp office | congress-mla | mla-gandra | jayashankar-bhupalapally-district | latest-telugu-news | latest telangana news