Rain Alert : ఓరుగల్లులో వర్ష బీభత్సం...నీటమునిగిన కాలనీలు

వరంగల్ జిల్లాలో మంగళవారం కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా వరంగల్ నగరంలో వర్షం దంచికొట్టింది. వరంగల్‌, హనుమకొండ, కాజీపేటల్లో భారీ వర్షం కురిసింది. సోమవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో హనుమకొండ బస్టాండ్, చౌరస్తాలో నీరు నిలిచింది.

New Update
Heavy Rains In Warangal

Heavy Rains In Warangal

Rain Alert : వరంగల్ జిల్లాలో మంగళవారం కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా వరంగల్ నగరంలో వర్షం దంచికొట్టింది.వరంగల్‌, హనుమకొండ, కాజీపేటల్లో భారీ వర్షం కురిసింది. వరంగల్ పట్టణంలోని శివ నగర్, ఎన్టీఆర్ నగర్ ,సాయి గణేష్ కాలనీ, శివ నగర్, ఎన్టీఆర్ నగర్ , వివేకానంద కాలనీ,  కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరింది. గోకుల్ నగర్, శాంతి నగర్, కాలనీలకు ముంపు ముప్పు పొంచి ఉందని అధికారులు తెలిపారు.  సోమవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో హనుమకొండ బస్టాండ్, చౌరస్తా, ఇతర లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. కాజీపేట, హసన్‌పర్తి, రెడ్డిపురం, గోకుల్ నగర్, అంబేడ్కర్‌ నగర్, న్యూ శాయంపేటలో వరద నీరు నిలవడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. 

వరంగల్‌ నగరంలో భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి.పాత బీటు బజార్‌, బట్టల బజార్‌లో రోడ్లపై వరద నీరు నిలిచింది. హంటర్‌ రోడ్డు, ఎన్టీఆర్‌ నగర్‌, రామన్నపేట, శివనగర్, కరీమాబాద్‌, సాకరాశి కుంటలో కాలనీలు జలమయమయ్యాయి. వరంగల్ నగరంలో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. బస్సులు డిపోలకే పరిమితమైన పరిస్థితి ఉంది. కరీమాబాద్, రంగశాయిపేట, కాశీబుగ్గ ప్రాంతాల్లో  మోకాళ్ల లోతు వరకు వరద నీళ్లు చేరుకున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు, షాపుల్లోకి వరద నీళ్లు రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. గడిచిన 12 గంటల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 92.9 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.
వరంగల్‌ నగరంలో భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. 

హంటర్‌ రోడ్డు, ఎన్టీఆర్‌ నగర్‌, రామన్నపేట, శివనగర్, కరీమాబాద్‌, సాకరాశి కుంటలో కాలనీలు జలమయమయ్యాయి. వరంగల్ రైల్వే స్టేషన్‌లో భారీగా నీరు నిలిచింది. ఉర్సుగుట్ట సమీపంలో డీకే నగర్‌లో ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. ఇక్కడి గుడిసెవాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. వరంగల్‌ నుంచి ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారిపై వరద నీరు నిలిచింది.  రోడ్ల పై భారీగా నీరు చేరడంతో  వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వరంగల్‌ జిల్లాలోని సంగెం మండలంలో 20 సెం.మీ. వర్షపాతం నమోదైంది, ఖిల్లా వరంగల్‌ లో 14.8 సెం.మీ, వర్ధన్నపేటలో 12 సెం.మీ, పర్వతగిరిలో 10.7, వరంగల్‌లో 9.5 సెం.మీ, గీసుకొండలో 9.2 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 

 కాగా వర్షం బీభత్సం సృష్టించడంతో అత్యవసర సహాయం కోసం హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు. అత్యవసర సేవలకోసం కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్లకు (వరంగల్ జిల్లా 1800 425 3434, 9154225936, హనుమకొండ జిల్లా 1800 425 1115, GWMC 1800 425 1980, 9701999676) కాల్ చేయాలని అధికారులు సూచించారు.

మహబూబాబాద్‌ జిల్లాలోనూ భారీగా వర్షం కురిసింది. కొత్తగూడ, గంగారం మండలాల్లో భారీ వర్షం కురిసింది. జిల్లాలో పలు వాగులు పొంగిపోర్లుతున్నాయి. కొత్తగూడ శివారులో రాళ్లతోటి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దంతాలపల్లి మండలంలో భారీ వర్షం కురిసింది. ఇక్కడి పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పెద్దముప్పారం-దంతాలపల్లి వంతెన పైనుంచి పాలేరు వాగు ప్రవహిస్తోంది. దీంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.  

Also Read: ఆగస్టు 27..భారత్ చరిత్రలో ముఖ్యమైన రోజుగా మారనుందా? అమెరికా, భారత్ ఫ్రెండ్షిప్ ముగియనుందా?

Advertisment
తాజా కథనాలు