Double Murder Case: జనగామ జిల్లాలో డబుల్ మర్డర్ కలకలం

తెలంగాణలోని జనగామ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు మహిళలను గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి తలలు పగల గొట్టి హత్య చేశారు. జనగామ జిల్లా జఫర్‌గఢ్‌ మండలం తమ్మడపల్లి(ఐ) గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లు దారుణ హత్యకు గురయ్యారు.

New Update
wife murder his husband

Double murder stirs up trouble in Jangaon district

Double Murder Case:

తెలంగాణలోని జనగామ జిల్లాలో దారుణం(Janagoan Incident) చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు మహిళలను గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి తలలు పగల గొట్టి హత్య చేశారు. జనగామ జిల్లా జఫర్‌గఢ్‌ మండలం తమ్మడపల్లి(ఐ) గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లు దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తమ్మడపల్లి(ఐ) గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లు గురువారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తల్లి (75), కుమార్తె (45)ను గుర్తుతెలియని దుండగులు చంపేసి, పారిపోయారు. 

Also Read : తెలంగాణ ఆర్టీసీ బంఫర్‌ ఆఫర్‌.. బస్సు ఎక్కితే చాలు..

తమ్మడపల్లి(ఐ) గ్రామానికి చెందిన మహిళలు ఇద్దరూ ఇంట్లో నిద్రిస్తు్న్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు.  ఇద్దరిని కత్తులతో పొడిచి తలలు పగలగొట్టి కిరాతకంగా చంపేశారు. శుక్రవారం ఉదయం ఇంట్లో నుంచి అలికిడి రాకపోవడంతో అనుమానంతో  స్థానికులు ఇంట్లో చూడగా ఇద్దరూ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిసరాలను తనిఖీ చేశారు. దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలను జల్లడపడుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆస్తి తగాదాలతోనే ఈ హత్యలు చోటుచేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తల్లీకూతుళ్ల హత్యతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read :  Love Murder Case : పెళ్లైన వ్యక్తితో సహజీవనం.. కూతుర్ని నరికి చంపిన తండ్రి.. ప్రియుడి పిటిషన్తో..!

Advertisment
తాజా కథనాలు