/rtv/media/media_files/2025/07/18/rains-for-another-three-days-orange-alert-issued-2025-07-18-21-34-15.jpg)
Rains
బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్ వల్ల వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలుగు ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. గత రెండు రోజుల నుంచి ఎలాంటి వర్షం లేకుండా పొడి వాతావరణం నెలకొంది. వారం రోజుల తర్వాత సూర్యుడు కనిపించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మరో బిగ్ అలర్ట్. అరేబియా సముద్రంలో మరో వాయు గుండం ఏర్పడనుంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రెండు రోజుల పాటు పొడి వాతావరణం ఉండి, ఆ తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇది కూడా చూడండి:Hyderabad Traffic: హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్.. ఈ ఏరియాల్లోకి అసలు వెళ్లవద్దు
Hyderabad Heats up 🔥🌞☀️🔥 After over few days of rainfall, Telangana is currently in the midst of a dry spell. No rain in city today also. As per #IMD Forecast Partly cloudy sky with one or two spells of rain or thundershowers and No warning. Expect showers Wednesday afternoon… pic.twitter.com/1uoERgRmZc
— Stephen hawking (@hawking2023) July 29, 2025
ఇది కూడా చూడండి: Rain: వెదర్ అలెర్ట్.. మరో 4 రోజులు భారీ వర్షాలు
నేడు తేలికపాటి జల్లులు
ఏపీ, తెలంగాణలో నేడు పలు చోట్ల తేలిక జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే రోజంతా పొడి వాతావరణమే ఉంటుంది. తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, నిజామాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రోజంతా పొడి వాతావరణం ఉన్నా ఆ తర్వాత తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దాదాపుగా రెండు రోజుల పాటు ఇలానే పొడి వాతావరణం ఉంటుంది. తర్వాత భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇది కూడా చూడండి: HYD Rain: తెలుగు రాష్ట్రాల్లో ముంచెత్తుతున్న వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు
ఏపీలోని ఈ జిల్లాల్లో..
ఏపీ రాష్ట్రంపై అల్పపీడనం ఎఫెక్ట్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, మన్యం, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఈ జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. అలాగే మత్స్యకారులు అసలు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. సముద్రతీర ప్రాంతాల్లో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలను సూచించారు.
ఇది కూడా చూడండి: Weather Update: బిగ్ రెయిన్ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో మూడు రోజులు కుండపోత వర్షాలే!