/rtv/media/media_files/2025/08/12/anishetti-rajitha-2025-08-12-08-12-46.jpg)
Anishetti Rajitha passes away
Anishetti Rajitha : ప్రముఖ రచయిత్రి అనిశెట్టి రజిత కన్నుమూశారు. సోమవారం రాత్రి ఆమె నివాసంలో గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. హనుమకొండ గోపాలపురంలోని అద్దె ఇంటిలో సోమవారం రా త్రి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం రాత్రి ఒక పుస్తకావిష్కరణ సభలోనూ పాల్గొన్న అనిశెట్టి రజిత ఆకస్మాత్తుగా అస్తమయం కావడంతో ఓరుగల్లు సాహితీలోకం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. వరంగల్‌ల్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక సాహితీ సంస్థలతో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సామాజిక అంశాలను ఇతివృత్తంగా తీసుకుని ఆమె రాసిన పుస్తకాలు దేశవ్యాప్తంగా బహుళ ప్రాచుర్యం పొందాయి. ఆమె అవివాహితురాలు పుస్తక రచనతో పాటు సామాజిక సేవకు తన జీవితాన్ని అంకితం చేశారు. వీరు 1992లో కాకతీయ విశ్వవిద్యాలయంలో బోధనేతర సిబ్బంది విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. నేటికి తన సేవలను అందిస్తూనే ఉన్నారు. 1977లో కాళోజీతో ఏర్పడిన సాహిత్య పరిచయంతో అనేక మెళకువలను నేర్చుకున్నారు. వీరు ఉద్యోగినిగా తన సేవలను అందిస్తూనే అనేక సంస్థల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఇది కూడా చూడండి:Palnadu Ragging: పల్నాడు లో ర్యాగింగ్ కలకలం.. కర్రలతో కొడుతూ.. కరెంట్ షాక్ పెడుతూ! వీడియో వైరల్
మహిళా సమానత్వం, స్త్రీ విముక్తి కోసం అనిశెట్టి రజిత అనేక రచనలు చేశారు. రజిత చిన్నతనంలో ఆకాశవాణిలో ప్రసారమయ్యే ప్రముఖ రచయితల ప్రసంగాలకు ఆకర్షితురాలయ్యారు. తద్వారా రచనలు చేయడం ప్రారంభించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తన రచనల ద్వారా ఉద్యమకారులను చైతన్యం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017లో తెలంగాణ ప్రభుత్వం ఆమెకు రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారంతో గౌరవించింది. ఆమె 1973లో ‘చైతన్యం పడగెత్తింది’ అనే రచనతో తన రచనా వ్యాసంగాన్ని మొదలుపెట్టి 500కిపైగా కవితలు, 109 వ్యాసాలు, 38 పాటల వరకు రచించారు. ఇరవైకిపైగా పురస్కారాలు అందుకున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేశారు. మరణానికి ముందే ఆమె తన దేహాన్ని వైద్యవిద్యార్థుల అధ్యయనం కోసం దానం చేశారు.అంతేగాక ప్రజాస్వామిక రచయిత్రుల సంఘం ఏర్పాటు చేసి మహిళలకు సంబంధించి అంశాలపై అనేక రచనలు చేశారు. తన రచనల ద్వారా పీడిత ప్రజలను చైతన్యం చేసేందుకు సామాజిక స్పృహ కలిగించే ప్తుస్తకాలు రాశారు.ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, తొలి, మలి ఉద్యమంలో కూడా తనదైన ముద్ర వేశారు.
అనిశెట్టి రజిత అనేక సామాజిక ఉద్యమాలలో తాను ముందుండి నడిపించారు.ఎంతో మంది మహిళా రచయిత్రులను ప్రోత్సహించారు.ఒక అభ్యుదయ వాదిగా,సామాజిక అసమానతలపై ఖండిస్తూ ధర్మాగ్రహాన్ని ప్రదర్శిస్తూ రచనా వ్యాసంగాన్ని కొనసాగించిన కావ్యశీలి.సామ్రాజ్యవాదం పై,దోపిడీపై, లింగం వివక్ష తలపై అలుపెరుగని పోరాటం చేశారు.ప్రపంచంలో ఏ మూలన అన్యాయం జరిగినా తన నిరసన ధ్వనులను వినిపించేది.తాను బ్రహ్మచారిణిగా ఉంటూ కేవలం సామాజిక న్యాయం కోసమే జీవితం త్యాగం చేసిన ఆదర్శజీవి.ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆమె పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు.ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రోత్సాహంతో మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అనేక బహిరంగ సభల్లో తన ఉపన్యాసాలతో ప్రజలను ఉద్యమం వైపు ఆకర్షితులయ్యేలా చేశారు.
గులాబీలు జ్వలిస్తున్నాయి (కవిత్వం 1994), నేనొక నల్లమబ్బునవుతా (కవిత్వం 1997), చెమటచెట్టు (కవిత్వం 1999), ఓ లచ్చవ్వ (దీర్ఘకవిత 2005), ఉసురు (కవిత్వం 2002), గోరంతదీపాలు (నానీలు 2005), దస్తఖత్ (హైకూలు2005), అనగనగా కాలం (కవిత్వం 2005), మట్టిబంధం (కథా సంపుటి 2006) నన్హే ఓ నన్హే మార్కెట్ స్మార్ట్ శ్రీమతి మొదలైనవి వారి రచనల్లో కొన్ని. అనిశెట్టి రజిత సంపాదకత్వంలో వెతలే కథలై, ఊపిరి, జిగర్, ఉద్విగ,ఆకాశపుష్పం,ముజఫర్‌నగర్ మారణకాండ, అగ్నిశిఖ, పోలవరం-ప్రాణాంతక ప్రమాదం మొదలైనవి వెలువడ్డాయి,
నెల రోజుల క్రితం విశాఖపట్టణంలో ప్రజా సేవకురాలు సీతారామలక్ష్మి మృతిచెందితే అక్కడే ఉండి ప్రత్యేక సంచిక రాసి వచ్చారు. నేత్ర, శరీరదానంపై పలు ప్రాంతాల్లో ప్రచారం చేయడమే గాక తాను చనిపోయిన తర్వాత శరీరాన్ని కాల్చి వృథా చేయడం కాదు.. వైద్య విద్యార్థులకు ఉపయోగపడాలంటూ పలువురు సాహితీవేత్తల ముందు చెబుతూ గతేడాది కేఎంసీ ప్రిన్సిపాల్‌కు అంగీకార పత్రం రాసిచ్చారు. సోమవారం రాత్రి నేత్రవైద్యశాల సిబ్బంది ఆమె నేత్రాలను తీసుకెళ్లారు. రిటైర్డు ప్రొఫెసర్, కవయిత్రి కాత్యాయని విద్మహే ఇంటికి ఆమె దేహన్ని తరలించారు. మంగళవారం అంతిమయాత్ర అనంతరం ఆమె శరీరాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి అందజేస్తారు.
Also Read: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. మరో ఐదు రోజులు వానలే వానలు